బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana) కరోనా (Carona) బారిన పడినట్లు తెలుస్తున్నది. తనకు కరోనా పాజిటివ్ (Carona Positive) వచ్చిందనే విషయాన్ని కంగనానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.
‘‘కొన్ని రోజుల నుంచి కళ్లు మండుతున్నాయి. అలసటగా, నీరసంగా అనిపించేది. హిమాచల్ ప్రదేశ్‌కు వెళదామని కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. కరోనా పాజిటివ్ అనే రిజల్ట్ వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో (Quarantine) ఉంటున్నాను. నా శరీరంలో కరోనా వైరస్ (Carona Virus) పార్టీని సెలబ్రేట్ చేసుకుంటాయని నేను భావించడం లేదు. నేను వాటిని నాశనం చేస్తాను. మీరు భయపడితే, కరోనా మరింత భయపెడుతుంది. రండి మనం దాన్ని నాశనం చేద్దాం. కొవిడ్ 19 అంటే భయపడేంత ఏమీ లేదు. చిన్నపాటి ఫ్లూ మాత్రమే, అయితే ప్రజలను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోంది’’ అని అన్నారు కంగనా రనౌత్.