Dwaraka TirumalaDwaraka Tirumala

ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) శ్రీవారికి హుండీల ద్వారా మూడుకోట్ల ఆదాయం వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారికి హుండీల ద్వారా సోమవారం భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కల్యాణమండప (Kalyana Mandapa) ఆవరణలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ లెక్కింపు జరిపారు. ‌

గడచిన 26 రోజులకు గాను హుండీ లెక్కింపు ద్వారా శ్రీవారికి 3,01,73,473 రూపాయల ఆదాయం వచ్చింది. అలానే భక్తుల కానుకల రూపేనా 414 గ్రాముల బంగారం 14.కేజీల 060 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు వివరించారు.

అలాగే పాత రూ 1000 (14 నోట్లు ), రూ 500 (38 నోట్లు ) పలు దేశాల విదేశీ కరెన్సీ (Foreign Currency) సైతం అధికంగా లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి G.V. సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

OTS పేరుతో పేదప్రజలపై వేధింపులు: ఆరిమిల్లి రాధాకృష్ణ

Spread the love