Nadendla manoharNadendla manohar

జనసేన అధినేత (Janasena President) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఉగాది (Ugadi) తర్వాత నియోజకవర్గాల వారీగా సమీక్షలు (Review meetings) చేపట్టనున్నారు. జనసేన పార్టీ (Janassena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ (Political affairs Committee Chirmen) నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) ఈ విషయాన్ని ప్రకటించారు. రెండో విడత క్రియాశీల సభ్యత్వాల నమోదుతో పాటు నియోజక వర్గానికి సంబంధించి పలు విషయాలను చర్చిస్తారని నాదెండ్ల తెలిపారు. అలానే నియోజక వర్గ అభ్యర్థుల, ఇన్చార్గుల, జిల్లా ఇంచార్జిల పని తీరుని కూడా పవన్ (Pawan Kalyan) సమీక్ష చేస్తారని నాదెండ్ల మనోహర్ వివరించారు.

జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న వాలంటీలతో నాదెండ్ల మనోహర్, పార్టీ కోశాధికారి రత్నం సమావేశం అయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామా స్థాయి వరకు తీసికెళ్ళిన కార్యకర్తలను, వాలంటీర్లను నాదెండ్ల అభినందించారు.

కార్యకర్తల కోరిక మేరకు క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరోమారు పొడిగించామని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నాదెండ్ల పార్టీ కార్యకర్తలను సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పలు కీలకమైన సూచనలు కూడా చేశారు.

పెరుగుతున్న పెట్రో ధరలపై నిరసన సెగలు!

Spread the love