J D LakshminarayanaJ D Lakshminarayana

జేడీ లక్ష్మీనారాయణ (J D Lakshminarayana) విశాఖ పార్లమెంట్ (Vizag Parliament) స్థానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకొన్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుండి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని జేడీ ఫౌండేషన్ సభ్యులు, సన్నిహితుల సమావేశంలో తీర్మానించినట్లు జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జగన్ మురారి ఒక ప్రకటనలో తెలిపారు.

అనేక పార్టీలు జేడీకి ఆహ్వానం పలికినప్పటికి కూడా సిద్ధాంతాలు కలవకపోవడంతో స్వతంత్రంగా పోటీచేయడానికి నిర్ణయం తీసుకునట్టు మురారి తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక శాసనసభ్యురాలిగా పోటీ చేస్తారని కూడా తీర్మానించామని జగన్ మురారి ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేకుండా, ఆర్థిక లోటుతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదే మిలిగిపోయింది. ప్రత్యేక హెూదా, నిధులు, ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం మాట తప్పింది. హక్కుగా ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా ఆంధ్రుల బావోద్వేగంతో ముడి పడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా అన్యాయంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసికొన్న కేంద్రం నిర్ణయాన్ని తిప్పి కొట్టడానికి న్యాయపోరాటం మొదలుపెట్టాం. ప్రస్తుతం హై కోర్ట్’లో కేసు నడుస్తున్నదని మురారి తెలిపారు.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్, పూర్తి స్థాయి రైల్వేజోన్, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాల పార్లమెంట్లో మాట్లాడి, న్యాయ స్థానాలలో కూడా పోరాడి సాధించాలనే అజెండాతో జేడీ ఒక నిర్ణయానికి వ వచ్చారు. విశాఖలో ఇప్పటికే ఉత్తరాంధ్ర సంజీవని కేజీహెచ్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. ప్రభుత్వాల వైఫల్యంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వైద్య మరియు విద్యారంగ సంస్థల అభివృద్ధి, రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కొరకు అజెండా రూపకల్పనతో ప్రయాణం ఉంటుంది. ఇప్పటికే రాజమండ్రి దగ్గర, ధర్మవరం గ్రామంలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి 12 ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక రైతు సంఘాలతో చర్చించారు అని జేడీ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావుకు “ఉత్తమ న్యాయవాది” పురస్కారం

Spread the love