Salaries cutSalaries cut

ఆఫీసుకు ఆలశ్యమైతే జీతాలు కట్
ఆదేశాలు జారీచేసిన ఏపీ ప్రభుత్వం!

కార్యాలయాలకు ఆలశ్యంగా వచ్చే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతనాల్లో కోతలు (Salaries Cut) విధించాలని ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. సమయానికి కార్యాలయాలకు రాకుండా, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిని కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

విధులకు ఆలశ్యంగా వచ్చే వారి వేతనాల్లో కోత విధించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం కార్యాలయాలకు పది నిమిషాల ఆలశ్యంగా వచ్చే ఉద్యోగులకు జీతంలో కోత పడుతుంది. తాజా ఉత్తర్వుల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో అన్నికార్యాలయాల్లో ముఖ ఆధారిత గుర్తింపును అమలు చేస్తున్నారు. గతంలో బయో మెట్రిక్‌ స్థానంలో కొత్తగా ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని అన్ని కార్యాలయాల్లో తప్పనిసరి చేశారు.

మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు ఆలశ్యంగా వచ్చే వారి వేతనాల్లో కోత విధించాలనే నిర్ణయంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని శాఖల్లో పని వేళలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తమ అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

ఆఫీసుకు ఆలశ్యంగా వస్తే శాలరీలో కోత విధించాలనే నిర్ణయాన్ని ఉపసంహ రించుకోవాలని అయా శాఖల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నరు. వారి నుంచి స్పందన లేకపోతే ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఫేషియల్ రికగ్నైజేషన్‌ విధానంపై ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలశ్యానికి జీతంలో కోత విధించాలనే నిర్ణయం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెబుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నైజేషన్‌ విధానం అమలు చేసే వరకు అటెండెన్స్ రిజిస్టర్ విధానాన్ని అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండెన్స్‌ రిజిస్టర్‌ను సంబంధిత శాఖల ఉన్నతాధికారి వద్ద ఉదయం పది గంటల నుంచి 10.10వరకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్యాలయ ఉన్నతాధికారి వద్దే ఉద్యోగులు అంతా 10 గంటల నుంచి 10.10లోపు హాజరు నమోదు చేయాలని, *ఆ తర్వాత వచ్చే వారికి ఆలశ్యంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆలశ్యంగా వచ్చే వారి జీతాల్లో కోత పెట్టాలని అంతర్గత సర్క్యులర్లలో సూచించారు.

టి వి గోవిందరావు, అడ్వకేట్, హైదరాబాద్

అత్యంత పేద రాష్ట్రానికి అత్యంత ధనిక సీఎం!: సేనాని కార్టూన్

Spread the love