Mahatma GandhiMahatma Gandhi

గాంధీ జయంతిని స్మరించుకొంటూ…
గాంధీ జయంతి అంటే హింసోన్మాద పాలకులు స్మరించుకొనేదా?
లేక బాధిత వర్గాలు మననం చేసికొనేదా?
శ్రమదానాలను అణచివేసే పాలకులు నీతులు చెప్పేదా?

జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) బోధించిన అహింసా పరమోధర్మః (Ahimsa Paramo Dharmah) అనే మూలా సిద్ధాంతాన్ని ఎన్నటికీ మరువలేని రోజే గాంధీ జయంతి (Gandhi Jayanthi). మహనీయుల జయంతిని కేవలం ఒక తంతుగా జరుపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. వారిని స్మరించుకోవడంవల్ల కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. వారి ఆశయాలను, బోధనలను నిత్యం అనుసరిస్తూ ఉండడం వల్ల ప్రపంచ శాంతికి, దేశ సౌభాగ్యానికి ప్రయోజనం ఉంటుంది. దీనిపై నేడు అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.

యావత్తు భారత దేశాన్ని ఏకతాటిపై నడిపిన యోధుడు

ప్రతీ అక్టోబరు 2న మనం జాతిపిత బాపూజీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ బాపూజీని, బాపూజీ (Babuje) సందేశాలను ఎంతవరకు అనుసరిస్తున్నాము? ఆయన చేసిన కర్తవ్య బోధ, పాటించిన విలువలు, అనుసరించిన జీవన విధానం మొదలైన వాటిని మనం ఎంత వరకు గుర్తు చేసికొంటున్నాము? అని మనకి మనం ప్రశ్నించుకోవాలి. యావత్తు భారత దేశాన్ని ఏకతాటిపై నడిపిన యోధుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (Mohan Das Karamchand Gandhi). మానవాళి చరిత్రలోనే అపురూపమైన మహోజ్వల స్వాతంత్య్రోద్యమాన్ని అహింసాతో ఉన్నతాన్ని నిలిపి, ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించిన సమరశీలి మన మహాత్మా గాంధీజీ.

సత్యం (satyam), శాంతి (Shanti), అహింస (Ahimsa), సహాయ నిరాకరణ (Non-cooperation) ఆయుధాలుగా మాత్రమే స్వతంత్ర ఉద్యమాలను చేస్తూ వచ్చారు. తద్వారా నిరసనకు ఓ కొత్త నిర్వచనం ఇచ్చి, త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. ముంబాయిలో గాంధీజీ అడుగు పెట్టే నాటికే భారత దేశంలోని పరిస్థితులు ఆయన్ని నాయకున్ని చేసేశాయి. రవి అస్తమించని సామ్రాజ్యమనే ఖ్యాతి గడించిన బ్రిటీష్‌ పాలకులను (British Rulers) భారత భూభాగం నుంచి బేషరతుగా పంపించడం అంటే సామాన్య విషయం కాదు. ‘సత్యాగ్రహం’ అనే ఆయుధంతో దీన్ని గాంధీజీ సాధించి చూపించారు. దేశప్రజలకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు.

గ్రామస్వరాజ్యం అధికార పార్టీలకు ఓట్లు కొనే ఖార్ఖనాలా?

‘ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక గాంధీ, తరతరాల మానవాళికి మార్గదర్శి ఈ గాంధీ’ అని నెల్సన్‌ మండేలా ఏనాడో అన్నారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న యువత గాంధీజీ బోధించిన అహింసా అనే సూత్రాన్ని పాటించడానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా సత్యాగ్రహం విలువను తెలిసికొని గాంధీజీని కీర్తించడం చేస్తున్నారు. ఇది అంతా గాంధిజీ అహింసా, సత్యాగ్రహంల యొక్క గొప్పదనం.

గాంధీజీ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని, మనమంతా గాంధేయవాదాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా మన దేశ రాజకీయ నాయకత్వం ఆయన బాటలో సాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ అది జారగడం లేదు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం (Grama Swarajyam) అధికార పార్టీలకు ఓట్లు కొనే ఖార్ఖనాలాగా నేడు కనిపిస్తున్నాయి.

స్వేచ్ఛ విలువ పాలకులకు-పోరాటాల విలువ బాధితులకు తెలీదు

శ్రమలేకుండా గడించే సంపద, వ్యక్తిత్వం ఇవ్వని జ్ఞానం, విలువల్లేని వ్యాపారం, సిద్దాంతాలకు లోబడని రాజకీయాలకు గాంధీజీ వ్యతిరేకం. గాంధీజీకి ఒక గజమాల వేసి గాంధీజీని కేవలం స్మరించుకొంటున్నాం. కానీ ఆచరించడం లేదు. నేటి పాలకులు, పాలితులు కూడా గాంధీజీని స్మరించుకొంటున్నారు గాని ఆచరించడం లేదు. ఇదే దురదృష్టం.

పాలితుల భయాలకు జ్ఞానబోధ చేసేది గాంధీ జయంతి

వీరికి గాంధీజీ బోధించిన అహింసా అంటే ఏమిటో తెలుసా? శ్రమ లేకుండా గడించే సంపద అంటే నేటి పాలకులకు తెలుసా? గాంధీజీ సత్యాగ్రహం విలువ రాజ్యమేలుతున్న నేటి కొంతమంది దుష్ట పాలకులకు తెలుసా? దుష్టులు రాజ్యమేలుతున్నారు? బాధితులు మాత్రం అణచివేతలతో కన్నీరు కారుస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా గాంధీజీని స్మరించుకొంటున్నారు. స్వేచ్ఛ విలువ పాలకులకు తెలీదు. పోరాటాల విలువ బాధితులకు తెలీదు. పాలకుల అణచివేతలకు-పాలితుల భయాలకు జ్ఞానబోధ చేసేది గాంధీ జయంతి.

ఒక పక్కన అణచివేతలపై పోరాడిన గాంధీజీకి గజమాల వేస్తారు. మరొక పక్కన శ్రమదానాలకు వస్తున్న వ్యక్తులను అణచివేస్తుంటారు. పాలకులకు, పాలితులకు గాంధీజీ ఆయుధాలు అయిన అహింస, సత్యాగ్రహంల వెలువ తెలీదు. గాంధీజీ ఇచ్చిన పోరాట స్ఫూర్తి (Insperation) అంటే ఏమిటో పాలితులకు తెలీదు. శ్రమదోపిడీదారులకు వస్తున్న అనుమతులు, శ్రమదానాలు చేస్తున్నవారికి ఎందుకు రావడం లేదు. అణచివేతలతో పాలించాలి అనే పాలకులకు ఎలా ఎదురు తిరగాలి? ఎలా మన హక్కులను మనం సాధించుకోవాలి ? అనేవి తెలిసికొనే రోజే గాంధీ జయంతి. అంతేకానీ ఒక గజమాల వేసి, నాలుగు మాటలు చెప్పి మరిచిపోయిది కాదు మన గాంధీ జయంతి (Gandhi jayanthi).

యావత్తు దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి, దేశానికీ స్వతంత్రం తెచ్చిన యోధుల్లో ప్రముఖుడు అయిన జాతిపిత మహాత్మా గాంధీజీకి వినమ్ర ప్రణామాలతో…

ఆలోచించండి… శ్రమ దోపిడీదారులకు వస్తున్న అనుమతులు… శ్రమదానం చేసేవారికి ఎందుకు రావడం లేదు?

Spread the love