Samatha murthy StatueSamatha murthy Statue

ముచ్చింతల్ (Muchintal) సమతామూర్తి (Statue of equality) భగవద్ శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని జనసేనాని (Janasenani) దర్శించు కున్నారు. అక్కడ ఉన్న 108 ఆలయాలను కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించి సమాజ హితం కోసం, సర్వ మానవ సౌబ్రాతృత్వము కోసం ప్రార్ధించారు. త్రిదండి చిన జీయర్ స్వామి ఆశీస్సులు కూడా సేనాని (Senani) తీసికొన్నారు.

జనసేనాని సందేశం!

ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముచ్చింతల్ చేరుకున్నారు. చిన్న జీయర్ స్వామి (China Jiyar Swamy) చెప్పిన మాటలు తనకు ఎప్పటికీ గుర్తు ఉంటాయి అని జనసేనాని అన్నారు. మన మతంను ప్రేమించు పరమతంను గౌరవించు అని స్వామీజీ చెప్పారని పవన్ అన్నారు. రామానుజాచార్యులు (Ramanujacharya) తనకు గొప్ప విప్లవ నాయకులుగా అనిపిస్తారని జనసేనాని అన్నారు.

దైవం ముందు అందరు సమానం అని చెప్పిన వారు రామానుజ చార్యులు అని పవన్ గుర్తకు తెచ్చుకున్నారు. 216 అడుగుల విగ్రహం పెట్టడం భాగ్య నగరంకు సరికొత్త గుర్తుగా మిగులుతుంది అని సేనాని అన్నారు. చిన్నజీయర్ స్వామి వారు తలపెట్టిన కార్యక్రమం చాల అద్భుతమైనది అని అయన అన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కారం కావడం చాలా సంతోషకరమైన విషయం అని పవన్ అన్నారు.

ముచ్చింతల్ దివ్య క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నా విషయం తెలిసిందే. 12 రోజులపాటు జరుగుతున్న ఈ మహా యజ్ఞంలో నేడు ఐదవ రోజు. ఐదవ రోజున యాగశాలలో పరమేష్టి, వైభవేష్టి కార్యక్రమాలు జరిగాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ జరగింది. జనసేనాని వెంట నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తదతర పార్టీ పెద్దలు కూడా పాల్గొన్నారు.

కొసమెరుపు:

PK craze at Muchinthal
PK craze at Muchinthal

213 అడుగుల ఎత్తయిన అతి పెద్ద రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని చూడకుండా వేలాదిమంది భక్తులు పవన్ కళ్యాణ్’నే చూసి తరించడం వింతగా అనిపించింది. అయినా అదే జనసేనాని, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ప్రజలకు సేనానిపై ఉన్న అభిమానానికి, ఆకర్షణకి నిలువెత్తు నిదర్శనం అని భావిస్తున్నారు.

సీఎం సమస్యని పెద్ద మనస్సుతో పరిష్కరించారు

One thought on “సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ <br> సమతామూర్తి ఆశీస్సుల మధ్య సేనాని క్రేజ్”
  1. Superb and very true your ” kosamerupu ” which reflected the masses love, faith and trust of Pawankalyan…..

Comments are closed.