“పేదలందరికీ ఇల్లు-జగనన్న కాలనీ” పధకంలో భారీ స్కాం (Big Scam) అని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక వంగ్యా కార్టూన్ (cartoon) విడుదల చేసారు.
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో గత కొంత కాలంగా విరుచుకు పడుతూనే ఉన్నారు.
జగనన్న కాలనీలలో (Jagananna Colonies) జరిగిన అవినీతి ఆరోపణలను ప్రజలకు వివరించే వ్యంగ్య కార్టూన్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నది అని చెప్పాలి.
అప్పుల ఊబిలో రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఖాళీ. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం అంటూ మొన్నటి కార్టూన్ ఉన్నది అనేది తెలిసిందే.
రోజుకొక వ్యంగ్య కార్టూన్’తో జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న సంగతి కూడా తెలిసిందే.
జగనన్న కాలనీలలో అవినీతి జరిగినట్లు నిరూపించమని వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్’కి సవాల్ విసురుతున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగా మారుతున్నాయి అని చెప్పాలి.