వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జనసేనాని
ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరం: పవన్ కళ్యాణ్
2024 లో జనసేనకు అధికారం ఇవ్వండి
వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) జనసేనాని (Jana senani) విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై (Government failures) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్త్ ప్లాంట్ (Vizag Steel Plant) అమ్మకాన్ని (Sale) నిలపడం కోసం వైసీపీ (YCP) పార్లమెంట్’లో (Parliament) పోరాటాలు చేయాలి. అఖిలపక్షాన్ని (All Party meeting) ఏర్పాటుచేయడంలో వైసీపీ విఫలం అయ్యింది అంటూ సేనాని దుయ్యబట్టారు. వైసీపీ రౌడీయిజాన్ని, గూండాగిరీని, బూతులను 2024 వరకూ భరించాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సమస్యల గురించి మాట్లాడుతుంటే పచ్చిబూతులు తిడుతున్నారని సేనాని తప్పుబట్టారు. అధికార పక్షంలా వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను దూషించడం జనసేన చేయదు అని జనసేనాని అన్నారు. ‘సిగరెట్లు ఎలా ఆరోగ్యానికి హానికరమో.. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ ప్రభుత్వం కూడా అంతే హానికరం’ అని నినాదం అందుకోవాలని జనసైనికులకు పిలుపిచ్చారు. రాష్ట్రానికి జనసేన (Janasena) ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు.
విశాఖ ఉక్కుకు జనసేన అండగా ఉంటుంది
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు (Privatization) వ్యతిరేకంగా, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఆదివారం మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఆయన సంఘీభావ దీక్ష చేపట్టారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేశారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), ఇతర నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చిన దీక్ష విరమింప జేశారు.
దీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో తమకు బలం ఉంటే ఢిల్లీ (Delhi) వెళ్లి తానే కేంద్ర పెద్దలతో మాట్లాడేవాడినని చెప్పారు. కానీ వైసీపీ మాదిరిగా చేతకాని వాడిలా కూర్చునేవాడిని కాదన్నారు. ‘చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు..? చేతకాని వ్యక్తులం కాదని నిరూపించుకోవాలంటే కనీసం పార్లమెంటు సమావేశాల్లోనైనా స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించాలి. వైసీపీ నాయకులకు, 22మంది ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిలబడాలి’ అని డిమాండ్ చేశారు.
విధానాలేగాని వైసీపీ నాయకులు శత్రువులు కాదు
వైసీపీ, ఆ పార్టీలోని నాయకులు తమకు శత్రువులు కాదని.. వారి విధానాలు బాగోనప్పుడు మాత్రం ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మందే కాకుండా 152 వరకు ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో తెలంగాణ వాళ్లు, కులమతాలకు అతీతంగా అందరూ మృతి చెందారని చెప్పారు. ‘స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదు. అది జాతి అభివృద్ధికి బలమైన సంకేతం. దేశానికి చాలా కీలకమైన పరిశ్రమ. ఇది సాధారణంగా వచ్చింది కాదు. ఎన్నో కష్టాలు, పోరాటం చేసి తెచ్చుకున్న పరిశ్రమ. అది ఆంధ్రుల ఆత్మగౌరవం. దాని ఆవిర్భావానికి గుంటూరు నుంచే పునాది పడింది అని జనసేనాని తెలిపారు. ప్రజలకు కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడే కాకుండా.. ఓటు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలని పవన్ కోరారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ మూల.. ఏ సమస్య వచ్చినా జనసేన గుర్తుకొస్తోందని పవన్ ఆనందం వ్యక్తం చేశారు.
సమస్యలపై వైసీపీ నోరెత్తడం లేదు
రాష్ట్రంలో రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఎయిడెడ్ స్కూల్స్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండున్నరేళ్ల కాలంలో సరైన జాబ్ కేలెండర్ (Job Calendar) ప్రకటించలేదు. ఇంత మంది యువతను మోసం చేసిన గద్దెనెక్కినవారు యువత గురించి మాట్లాడడం లేదు. మనం ఏదైనా మాట్లాడితే భయపెడుతున్నారు. సగటు మనిషి నుంచి న్యాయమూర్తి వరకూ.. ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారు.. దాడులు చేయిస్తున్నారు. చట్టసభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారంటే చాలా బాధ అనిపించింది. చట్టసభ శాసనాలు చేసే సభ. అక్కడ బూతులే శాసనాలు అయినప్పుడు.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ప్రతిపక్ష నేతను, ఆయన సతీమణిని ఆ స్థాయిలో తిడితే.. రాష్ట్రంలో ఆడబిడ్డకు, మహిళలకు రక్షణ ఉంటుందా..?
2024లో కొత్త ప్రభుత్వంగా బాధ్యత మా జనసేనకి ఇవ్వండి. ఇంట్లోనుంచి బయటకు వచ్చే ఆడబిడ్డ వైపు.. రౌడీ, గూండా కన్నెత్తి చూడాలంటేనే భయపడే రోజులు తీసుకొస్తాం. నాయకుల్ని కూర్చోబెట్టి తిట్టిస్తే.. చిల్లర తాటాకు చప్పులకు జనసేన భయపడే ప్రసక్తే లేదు అని జనసేనాని స్పష్టం చేశారు.
ఇది అల్టిమేటం కాదు. అభ్యర్ధన
స్టీల్ ప్లాంట్ ఒక కులం, మతం, వర్గం సమస్య కాదు. ఒక పార్టీ సమస్యా కాదు. రాష్ట్ర ప్రజలందరి సమస్య. దీని గురించి మాట్లాడేందుకు అందరూ కలిసి రావాలి. ఈ విషయంలో వైసీపీ బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఆ పార్టీకే అధికారం ఇచ్చారు. వైసీపీ బాధ్యత తీసుకోవాలని నేను అల్టిమేటం ఇవ్వడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్న పార్టీకి.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అల్టిమేటం ఎలా ఇవ్వగలడు? ఇది నా అభ్యర్థన మాత్రమే.
ప్రత్యేక హోదా గురించి గొంతు చించుకుని తిరిగాను. నా వెనుక ప్రజలు రాకపోతే ఏం చేయను? ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోతే ఏం చేయాలి? బీజేపీ జాతీయ అగ్రనాయకత్వానికి నేనంటే చాలా ఇష్టం. దానికి కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడుతున్నాను. నేను ఒక అడుగు వెనక్కి తీసుకుని ఏదో ఒక పార్టీలో చేరితే కేంద్ర మంత్రిగా ఉండగలను. కానీ నేను ఒక్కడినే కాదు.. ఒక తరం గెలవాలని ఆలోచిస్తున్నాను. 22 ఎంపీలు జనసేనకు ఉంటే స్టీల్ ప్లాంట్ ఈ స్థాయికి వచ్చేది కాదు. ఒక్కరైనా ఉండి ఉంటే పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టేవాడిని.
వైసీపీది నాడొక మాట… నేడొక మాట
విలువలు లేనివారు రాజ్యాంగాన్ని పాటించరు. ఈ రోజు వైసీపీ అదే చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి రాగానే మరోమాట. స్టీల్‌ప్లాంట్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరాను. వైసీపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మేం ప్రజల కష్టాలను బయటకు తీసుకురాగలం. కానీ పార్లమెంటులో మీ ఎంపీలు చేసిందే శాసనం. నేను మీటింగ్ పెడితే లక్షల మంది జనం వస్తారు. కానీ చట్టసభల్లో బలహీనుడిని. భవిష్యత్‌లో జనసేన ప్రభుత్వం స్థాపిస్తే.. ప్రజలు భారీగా మద్దతిస్తే.. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏ స్థాయిలో పని చేస్తాడో చేసి చూపిస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ నాయకులు మరోసారి బయటకు రావాలి.. పాదయాత్ర చేసేందుకు వాళ్లు వస్తే మద్దతిచ్చి సంఘీభావం తెలుపుతాను. దేశంలో వారసత్వ రాజకీయాలను ఒకేసారి తీసి పక్కన పెట్టి వ్యక్తి మోదీ.. అందుకే ఆయనంటే మాకు చాలా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్ తన ఆవేదనని వెలిబుచ్చారు.
మోదీతో నేను గొడవ పెట్టుకోలేనా?
స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోదీతో నేను గొడవ పెట్టుకోవాలని వైసీపీ నాయకుల కోరిక. నాకు బీజేపీ (BJP) అగ్రనాయకత్వం (High Command) వద్ద మంచి పేరుంది. రెండేళ్ల క్రితం బీజేపీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఏపీకి అమరావతి (amaravathi) రాజధానిగా ఉండాలని జనసేన కోరింది. దానికి బీజేపీ ఆగ్రనాయత్వం సమ్మతించింది. అమరావతే రాజధాని అని రెండేళ్ల కిత్రమే నేను చెప్పాను. రెండేళ్ల తర్వాత అదే మాట కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Sha) చెప్పారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన ఆయనకు ధన్యవాదాలు. ఈ రోజున నేను విశాఖ ఉక్కు కార్మికులకు మాటిస్తున్నాను. అమరావతికి నిలబడినట్లే స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతాం. దీనిని ప్రైవేటీకరిస్తున్నారని తెలియగానే నేను, మనోహర్ ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసి నివేదించాం. దీనిని కేవలం స్టీల్ ప్లాంట్ మాదిరిగా కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవంగా చూడాలని కోరాం.
ఒక్క శిలాఫలకం కూడా లేదు..
వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు.. మనల్ని ఎలా మోసం చేస్తున్నారు.. ఎలా వంచిస్తున్నారన్న విషయాలు మనం చెప్పాలి. రెండేన్నరేళ్లలో వైసీపీ ఒక శిలాఫలం కూడా ప్రారంభించలేదు. 500 మంది సలహాదారులు ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎలా ఆపాలన్న విషయంపై ఎందుకు లేరు? రాయలసీమలో కనివిని ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. ఏడుకొండలస్వామి కూడా మీరు ఇక రావద్దని గండికొట్టేశాడు. వాళ్లు చేసే పాపాలు అలా ఉన్నాయి. తిరుమల కూడా వైసీపీ వద్దని చెబుతోంది. ఒక చిన్న ప్రాంతానికి వెళ్లి వస్తే అయిపోతుందా..? రాష్ట్రంలో డబ్బుల కంటే అప్పులెక్కువ ఉన్నాయి.
వైసీపీకి రాజనీతిజ్ఞత ఉందా?
మోదీ ప్రభుత్వంపై హరియాణా.. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు పోరాటాలు చేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని, క్షమాణలు చెప్పారు. అది రాజనీతిజ్ఞత. వీళ్లు ఒక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలన్న ప్రయత్నం చేయడం లేదు. చేతకాకపోవడం కాదు.. బరితెగించిన తనం. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మేం నిలబడతాం.. కార్మికులు, నిర్వాసితుల కుటుంబాలూ నిలబడాలి. మీకు లేని కోపాన్ని నేను తీసుకురాలేను. పెద్దలు బొత్స, వైసీపీ పెద్ద నాయకులను సంఘీభావం తెలపాలని కోరాలి. వైసీపీని రోడ్ల మీద నిలబెట్టే ముందు జనసైనికులు బలంగా ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నాలు అయిపోయిన తర్వాత రాష్ట్ర బీజేపీ, మిగిలిన పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రణాళిక అనుకోవాలి.
అవసరం అయితే సినిమా ఉచితంగా వేపిస్తా
వైసీపీ మాటలకు అర్థాలు వేరు! సంపూర్ణ మద్యనిషేధం అంటూనే కొత్త బ్రాండ్లు తయారుచేసి అమ్మేస్తున్నారు. నా సినిమాలు ఆపేస్తున్నారు. వాటిని ఆపి.. నా ఆర్థిక మూలాలు దెబ్బతిస్తే భయపడిపోతానని అనుకుంటున్నారు. అంత పంతానికి వస్తే ఏపీలో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను అని పవన్ స్పష్టం చేశారు.
సినిమా (Cinema) టికెట్ ఆన్‌లైన్ (Ticket online) చేయడానికి కారణం ఏమిటంటే పారదర్శకత లేదని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి పారదర్శకత ఉందా..? అదే ఉంటే కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఆ మాటంటే బూతులు తిడతారు. మనం గజగజలాడిపోవాలి. వాళ్లు అమ్మే మందుకు పారదర్శకత ఉందా..? మన ఆరోగ్యం పాడు చేసి, మందు రేట్లు పెంచేసి.. ప్రజల నుంచి డబ్బులు తీసుకుని.. అదే డబ్బుతో మళ్లీ మన ఓట్లు కొనుక్కునే వారి దగ్గర అయ్యా.. బాబూ అంటూ మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బాగుపడే ప్రసక్తే లేదు అని పవన్ వివరించారు.