Bheemla NayakBheemla Nayak

పవర్ స్టార్ (Power Star) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రానా (Rana) కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లానాయక్‌ (Bheemla Nayak) సంక్రాంతికే (Sankranthi) విడుదల కాబోతున్నట్లు తెలుస్తున్నది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించించినది . అదే సీజన్‌లో రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ల (NRT) ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (జనవరి 7), ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ (జనవరి 14) వస్తుండటంతో ‘భీమ్లా..’ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పందించింది. భీమ్లా నాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఉంటాడని తెలిపింది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో సందడి చేస్తాడని స్పష్టం చేసింది.

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది అనేది తెలిసిన విషయమే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. తమన్‌ స్వరాలు ఇస్తున్నారు. పవన్‌ పోలీసు అధికారిగా, రానా డానియల్‌ శేఖర్‌గా (Daniel Shekar) కనిపించనున్నారు. నిత్యమేనన్ (Nithya Menon), సంయుక్త మేనన్‌ కూడా నటిస్తున్నారు.

Heavy Rains in Tirumala and Tirupati

Spread the love