సమసమాజ స్థాపన ఒక్క మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎంయస్పీ పోలవరం ఇంచార్జ్ విస్సంపల్లి సిద్ధూ మాదిగ అన్నారు. శనివారం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిడిపి గంగాధరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంఎస్పి పార్టీ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పోలవరం నియోజకవర్గంలోని గిరిజన సమస్యల కోసం పాటుపడేందుకు గిరిజన గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకెళ్లే దిశగా ఎంస్పీ మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
కమిటీల నియామకానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జుజ్జువరపు వాసుచౌదరి తదితరులు పాల్గొన్నారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు