బిపిన్ రావత్ సంస్మరణ సభలో మాజీ కేంద్ర మంత్రి
జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) అకాల మరణం దేశానికి తీరని లోటు అని మాజీ కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి పళ్లంరాజు (Pallam Raju) ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి (East Godavari) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చిలుకూరి పాండురంగారావు ఆధ్వర్యంలో జనరల్ బిపిన్ రావత్ సంస్మరణ సభ జరిగింది. జనరల్ రావత్ చిత్ర పటానికి మాజీ కేంద్రమంత్రి వర్యులు ఎం ఎం పల్లంరాజు చేతుల మీదుగా పూలమాలను ధరింప జేశారు. ఈ సందర్భంగా జనరల్ బిపిన్ రావత్ అకాల మరణంపై పళ్లంరాజు తీవ్ర విచారం వ్యక్త చేసారు. బిపిన్ రావత్ యొక్క విశిష్ట సేవలను పళ్లం రాజు దేశ ప్రజలకు గుర్తు చేశారు.
మన భారత ప్రజలు చాలా కష్టమైన సంధిగ్ధా అవస్థలో ఉన్నాము. ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మనకి ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) మాత్రమే ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే చైనా (China) కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నట్లు తెలుస్తున్నది. చైనా చాలా జోరుగా వాళ్ళ పొజిషన్ మార్చుకొంటూ సరిహద్దులను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా వింటున్నాం. సౌత్ చైనా సముద్రంలోగాని, భారతదేశ సరిహద్దుల్లో గాని,సెంట్రల్ ఆసియాలో (Central Asia) గాని అమెరికాకి, లేదా ప్రపంచానికి ప్రధమ ప్రత్యర్థిగా ఈవేళ చైనా తయారవుతున్నది.
చైనా మనకు ఒక తలనొప్పిగానే…
వాణిజ్యంగా ఎలావున్నాగాని, మన పరస్పర సంబందాలు చూసుకుంటే ఇది చాలా ఇబ్బంది పెడుతున్న విషయం. ఒకవైపు భారత దేశానికి చైనాకి వాణిజ్యం పెరుగుతున్నా గాని ఈ సరిహద్దు వివాదం తేలనంత వరకూ చైనా మనకు ఒక తలనొప్పిగానే ఉంటుంది. ఇది వాస్తవం. ఇదేదో ఒకటి,రెండు సంవత్సరాలలో మాయమయ్యే విషయం కాదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ద్వారా, అలాగే చైనా సెక్యూరిటీ అడ్వైజర్ ద్వారా ఈ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకొనేవాళ్ళం. త్రివిధ దళాలలో సమన్వయము కోసం జనరల్ బిపిన్ రావత్’ని నియయించారు అని పళ్లంరాజు వివరించారు.
అయితే గత సంవత్సరంలో పార్టీ ఫెయిల్యూర్ అవ్వచ్చు… లేదా చైనాని సరిగా డీల్
చేయలేకపోవడం మూలంగానోగానీ చైనా బలగాలు, మన సరిహద్దుల్లోకి వచ్చి తిష్ట వేసినట్లు తెలుస్తున్నది. వాళ్ళు అక్కడ నుండి కదిలే వెళుతున్న కదలికలు కూడా కనిపిస్తున్నట్లు లేదు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఇటువంటి వివాదాలను పరిష్కరించడానికి అవసరమైన ముఖ్య వ్యక్తుల్లో జనరల్ బిపిన్ రావత్ ఒక్కరు. అటువంటి దేశభక్తి గల నిజాయితీ పరుడు, జనరల్ బిపిన్ రావత్ అకాల మరణం భారత దేశానికి తీరని లోటు… అని మాజీ కేంద్రమంత్రి ఎం ఎం పళ్లంరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బి సి సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పార్లమెంట్ ఇంచార్జి మల్లిపూడి శ్రీరామ చంద్రమూర్తి, కాకినాడ సిటీ ఇంచార్జి కోలా ప్రసాదవర్మ. డి సి సి ఉపాధ్యక్షుడు బాజిబోయిన వెంకటేష్ నాయుడు, జనజాగరణ అభియాన్ కో ఆర్డినేటర్. హరికుమార్ రాజు, నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, INTUC సిటీ & రూరల్ అధ్యక్షుడు తాళ్లూరి రాజు. పిఠాపురం ఇంచార్జి మేడిది శ్రీనివాస్. జగ్గంపేట ఇంచార్జి మరోతి శివ గణేష్ పాల్గొన్నారు.
ప్రత్తిపాడు ఇంచార్జి ఉమ్మిడి వెంకట్రావు, పెద్దాపురం ఇంచార్జి తుమ్మల దొరబాబు, మాజీ నగర అధ్యక్షుడు ఆకుల వెంకట రమణ. నగర ఉపాధ్యక్షుడు కుక్కల పోతురాజు, ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్, ఇంటి వీరభద్రరావు ఎం పి టి సి. మాజీ కౌన్సిలర్ కంభం రాజబాబు, గుత్తుల శ్రీనివాస్, తోట కరుణాకర్, దంగేటి సత్తిబాబు, ధరణాలకోట శ్రీను,వి వి రమణ. జి. శ్రీనివాస్,కె. తరుణ్,బాషా, జుట్టుక సత్తిబాబు, ముంజవరపు మాణిక్యాలరావు, దమ్ము నూకరాజు, బావిశెట్టి సత్యనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు.