పల్లకీలు (Pallake) మోసింది ఇక చాలు. కదలి రండి. మనం పల్లకీలు ఎక్కడం కోసం పోరాటం చేద్దాం అని యువత అంటుంటే మీరు మాత్రం పల్లకీలు మోయడం కోసమే పోటీలు పడుతున్నారు?
కాపు (Kapu) కాసేవారిదే అధికారం అన్న నిన్నటి కాకి పలుకులు పీకే (PK) కోసమే ఇచ్చారు అంటా అనే కామెంట్లు వింటుంటే జాతికి కన్నీరు ధారలై వస్తున్నది. ఆ కన్నీరుని ఆపే నాయకులు కంటే ఆ కన్నీరుని తులాల లెక్కేన అమ్మేసే తోపులే ఎక్కువ అయినట్లు ఉన్నది. పీకే అంటే మీరు అనుకునే పీకే కాదు అండీ బాబు… తీహారీ పీకే (Tihari PK) అంటా?
పల్లకీలు మోయడమే శాసించడమా?
అధికారం (Power) కోసం పోటీపడదాం అని పిల్లలు అంటుంటే, తోపు పెద్దలేమో పల్లకీలు మోయడం కోసమే తిట్టుకు చద్దాం అంటున్నారు. పల్లకీలు మోయడాన్నే శాశించడం అని భావించే ఈ తోపు పెద్దలను (Kapu Peddalanu) ఏమనాలి? చప్పట్లు కొట్టే తోపులను ఏమని అర్ధం చేసికోవాలి.
పెద్దరికం వహించమన్నది కోడి పందాల (Kodi Pandalu) కోసం కాదు. కోడిపందాల్లో బలైపోతున్న కోడిపుంజుల్లా… మన జాతి భవిత బలైపోతున్నది. దీని గురించి ఆలోచంచమని. వీరికి విముక్తి కల్పించడానికి ముందుకు రమ్మని. జాతికి కావాల్సింది కోడి పందాలు కాదు. అధికార ఫలాల్లో సమాన వాటా అని ఈ తోపు నాయకులకు అర్ధం అయ్యేది ఎప్పుడు?
పీకే (పవర్ లేని కులాల ) గురించి ఆలోచన?
తోపులు ఆలోచించాల్సింది తీహార్ పీకే గురించి కాదు. ఆంధ్రాలో ఉంటున్న పీకే (పవర్ లేని కులాల ) గురించి, వీరి నుండి వస్తున్న పార్టీల గురించి అని చెబితే ఈ తోపు నాయకులకు ఎలా అర్ధం అవుతుంది. జాతి కారుస్తున్న రక్త కన్నీరు విలువ ఎలా, ఎప్పుడు తెలుస్తుంది?
తోపు నాయకులకు (Kapu Leaders) బోరికలు వేసే స్థోమత కూడా కోన ఆశతో నెట్టుకొస్తున్న ఈ యువతకి లేక పోవచ్చు. కానీ గుండెల్లో పెట్టుకొని మాత్రం పూజిస్తారు. బహుశా ఇదే ఈ జాతుల దౌర్భాగ్యం కావచ్చు. ఎందుకంటే గుండెల్లో పెట్టుకొనే వారిని విస్మరిస్తూ, గుండెల్లో పొడిచేవారికే పల్లకీలు మోస్తున్నారా? అనే భావాలనే భరించలేక పోతున్నాం.
మీలో పాలకుల పల్లకీలు మోయడానికి పోటీపడే తోపు నాయకులు ఉన్నంతవరకు నిన్ను పల్లకీ ఎక్కనివ్వరు అనే సూటి పోటి మాటలు వింటుంటే మాలో రక్త కన్నీరు ధారలా ప్రవహిస్తున్నది. మా కన్నీటిని తుడిచేవాడు కావాలని తోపు యువత చూస్తుంటే… వారి కన్నీటిని అమ్ముకొనే వారే నాయకులుగా నేటికీ ఉంటూ వస్తున్నారు?
అణచివేస్తున్నది పాలకులు అయితే తిరగబడవచు. కానీ మన ఆశల సౌధాన్ని, బాధిత వర్గాల పార్టీలను త్రుంచేస్తున్నది, మన తోపు నాయకులే అంటే ఏమి చేయాలి? ఎవరికీ చెప్పుకోవాలి
రక్త కన్నీటితో (Raktha Kanneeru) ఇంత వ్యాపారం జరుగుతున్నా “మార్పు” (Change) మాత్రం మనోహరమైన (Manoharamiana) మాటల కోటలు దాటి జనాల్లోకి రావడం లేదు. జాతి కన్నీటి గాధలను, జాతి రక్త కన్నీటితో వ్యాపారం చేస్తున్నవారికి అడ్డుకట్ట వేయడానికి ఆ పవనాలు సంపూర్ణుడై రావడం లేదు. మనోహర మాటల కోటలను పవనాలు దాటేదెప్పుడు? ప్రచండ పవనాలై బాధిత వర్గాలను ఆదుకొనేదెప్పుడు? అనే వారి ఆవేదన కూడా అక్షర సత్యాలే.
(నా ఆవేదన నిజమైతే నలుగురికి పంపండి. లేకపోతే డిలీట్ చేసీ చప్పట్లు కొట్టడం కొనసాగించండి).
ఆలోచిందండి… ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు. ఎవ్వరిని పోల్చి రాసింది కాదు. ఇది నాలో ఉబికి వస్తున్న రక్త కన్నీటితో రాసిన అక్షర మాలిక మాత్రమే. (Its from Akshara Satyam)