SimhamSimham

వేటగాళ్లు వాదులాడుకొంటున్నారు.

పచ్చ వేటగాళ్ళే… కాదు కాదు నీలి వేటగాళ్ళే

సింహాన్ని వేటాడబోతున్నారు అని

వేటగాళ్లు వాదులాడుకొంటున్నారు.

సింహ భాగాలను పంచుకోబోయేది ఈ వేటగాళ్లు ఇద్దరూ

హస్తినలో ఉన్న పువ్వు సాక్షిగా ఇది కుర్చీలాటనే.

సింహాలను సంహరించేది ఈ వేటగాళ్ళే

చరిత్రలను రాసేది కూడా ఈ వేటగాళ్ళే

ఎందుకంటే… సింహాలు తమ చరిత్ర రాసుకోలేవు కదా!

మరో మహా విద్వంసం తరువాత,

ఈ సింహపు పిల్లలను తమ పెరట్లో కట్టుకొనేది ఈ వేటగాళ్ళే.

ఆలోచించండి… మన చరిత్రలను మనం రాసుకోలేమా? కోపాన్ని తగ్గించుకొని మన LKG బుద్దిగల పెద్దలను కలుపుకొని వేటగాళ్ల భరతం పెట్టలేమా? (It’s from Akshara Satyam)

జనసేనానిపై కుట్ర – రహస్యాలు పయటపెట్టిన నాదెండ్ల

Spread the love