కేసుల్లో 31 శాతం మరణాల్లో 35 శాతం ఒక్క మే లోనే?
దేశంలో కోవిడ్ (Covid) సృష్టిస్తున్న మరణ మృదంగ ధ్వనులు (Marana Mrudanga Dwanulu) ఏప్రిల్ – మే మధ్య కాలంలో రికార్డు స్థాయిలో నమోదు అయినట్లు తెలుస్తున్నది. దేశంలో సెకండ్‌వేవ్‌లో (Carona Second wave) కరోనా విజంభృణ పెరిగింది. దీనితో దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 31.67 శాతం కొత్త కేసులు ఒక్క మే నెలలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ (Health Ministry) గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 2.8 కోట్లకు మించిన కేసుల్లో 31.67 శాతం అనగా 88.82 లక్షల కొత్త కేసులు ఒక్క మే నెలలో నమోదయ్యాయని గణాంకాల్లో బయటపడ్డాయి.
దేశంలో ఇప్పటి దాకా 3,29,100 మంది కోవిడ్‌తో ప్రాణాలుకోల్పోగా ఒక్క మే నెలలోనే 1,17,247 మంది చనిపోయినాట్లు తెలుస్తున్నది. మొత్తం మరణాల్లో 35.63 శాతం మరణాలు ఒక్క మే నెలలోనే సంభవించాయి. రోజువారీగా నమోదైన కొత్త కరోనా (Carona) కేసుల సంఖ్య సైతం గత మే నెలలోనే నమోదైంది.
దేశంలోనే రికార్డుస్థాయిలో 4,14,188 కొత్త కేసులు మే 7వ తేదీన నమోదు అయ్యాయి. ఏకంగా 4,529 మంది కోవిడ్‌కు మే 19వ తేదీన బలయ్యారు అని తెలుస్తున్నది. మే 10న యాక్టివ్ కేసుల సంఖ్య సైతం గరిష్టస్థాయిలో 37,45,237గా నమోదైంది.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసికొంటున్న చర్యల వల్ల, ప్రజల్లో పెరిగిన జాగరూకత వల్ల, కరోనా విజృంభణ రోజు రోజుకీ తగ్గడం మొదలు పెట్టడం శుభ సూచకం.