శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం గ్రామంలో స్వయంభుగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వేంచేసి యున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా శనివారం ఉదయం అయిదు గంటల నుండి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు తగిన రీతిలో దేవస్థాన కమిటీ ఏర్పాటు చేసిందని వివరించారు.
వచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థాన చైర్మన్ కేసరి విజయభాస్కర్ రెడ్డి మరియు దేవస్థాన బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు