జనసేన శ్రేణులపై (Janasena cadre) వైసీపీ ప్రభుత్వం (YCP Government) పెడుతున్న అక్రమ కేసులపై (False cases) రాష్ట్ర డీజీపీ (AP DGP) దృష్టికి తీసికురావాలని జనసేన పార్టీ (Janasena Party) నిర్ణయించింది. జనసేన నాయకులు (Janasena Leaders), కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని బృందం రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో చర్చించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర డీజీపీ అపాయింట్మెంట్’ని జనసేన పార్టీ (Janasena party) కోరింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
రాష్ట్రంలోని శాంతిభద్రతల (Law and order) పరిస్థితులపై ఈ సందర్భంగా డీజీపీకి తెలియచేస్తామని లేఖలో పేర్కొన్నారు. తేదీ, సమయం ఇవ్వాలని డీజీపీని జనసేన పార్టీ కోరింది.