దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా (Ennikala Nagara) మోగింది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, ఉత్తరాఖండ్ (Uttarakhand), పంజాబ్ (Punjab), గోవా (Goa), మణిపూర్ (Manipur) శాసనసభ ఎన్నికల షెడ్యూలును (Elections schedule) ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించింది. రాబోయే లోక్‌సభ (Lok sabha) సాధారణ ఎన్నికల (General elections) కోసం ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఈ శాసన సభల ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి అని భావిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో 403, పంజాబ్‌లో 117, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 , గోవాలో 40, శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.
5 రాష్ట్రాలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి అని ఎన్నికల కమిషన్ వివరించింది.
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో (Vijnan Bhawan) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (Chief Election Commissioner) సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో (Press Meet) మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని అయన తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుందని తెలిపారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుందని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో పోలింగ్ ఫిబ్రవరి 14న జరుగుతుందని కూడా తెలిపారు. మణిపూర్‌లో పోలింగ్ ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో జరుగుతుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూలు క్రింది విధంగా ఉంటుంది.
పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో పోలింగ్ సమయాన్ని అదనంగా ఓ గంట పొడిగించినట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు.