Senani distributing chequesSenani distributing cheques

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన భరోసా
అభాగ్యులకు జనసేన జనవాణి కొనసాగింపు
ఒక పక్కన నోటీసులు-మరొక పక్కన మీ దాతృత్వం
పవన్ కళ్యాణ్ అంటే దేవుడా?
ఆ తల్లీ బిడ్డలా చుట్టూ చలి-పోలీసులు అయినను…

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జనసేన నాయకులూ (Janasena Leaders) పోలీసుల పహారాలో (Police Custody) ఉన్నారు. పవన్ కళ్యాణ్ తమ స్వేచ్చని కోల్పోయినప్పటికీ సేనాని చూపిస్తున్న సౌమ్యం, సామాన్యులకు ఆదుకొనే వైఖిరి ఔరా  అనిపిస్తున్నది. సమస్త జనులను మెప్పిస్తున్నది. ఒక పక్కన పోలీసుల బంధనాలు మధ్య సేనాని (Janasenani) ఉన్నారు. అయినప్పటికి జనసేన జనవాణిని (Janasena Janavani) కొనసాగించాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశం ఇచ్చారు. తమ బాధలు చెప్పుకోవాలి అని వచ్చిన సామాన్యులకు బాధ కలుగకూడదు అని భావించి జనవానిని కొనసాగించమని సేనాని ఆదేశించారు. అందుకే ఇది నీకే సాధ్యం అని సోషల్ మీడియా కోడై చూస్తున్నది.

ఒక పక్కన నోటీసులు-మరొక పక్కన మీ దాతృత్వం

మరొక పక్కన విశాఖని వదిలి వెళ్ళాలి అని చెప్పడానికి నోటీసులతో (Police Notice) విశాఖ పోలీసులు (Visakha Police) వచ్చారు. మరొక పక్కన కాస్త సమయం ఇస్తే మా కార్యకర్తల కుటుంబాలను ఆదుకొని మీ నోటీసులు తీసికొంటాను అనే జనసేనాని ఆవేదనలు. చివరకు మరణించిన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు భీమా చెక్కుని అందచేయాలి అనే తన నెరవేర్చారు. 

ఆ తరువాతనే నోటీసులు హుందాగా తీసికొన్నారు. పోలీసులపై నానాయాగీ చేసే నాయకులను, మాజీ ముఖ్యమంత్రులను చూసాం. కానీ పోలీసులను ఒక్క ముక్క కూడా అనని నాయకుడిని నిన్నే చూస్తున్నాం. అందుకే ఇది నీకే సాధ్యం అని సోషల్ మీడియా కోడై చూస్తున్నది.

కష్టాలు నాకు కావచ్చు. బందిఖానాలు నా నాయకులకి కావచ్చు. అయినప్పటికీ నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకొన్న బాధిత ప్రజలకు అండగా ఉంటాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ నిరూపించారు. అందుకే ఇది నీకే సాధ్యం అని సోషల్ మీడియా కోడై చూస్తున్నది.

పవన్ కళ్యాణ్ అంటే దేవుడా?

అందేకేనేమో పవన్ కళ్యాణ్ దేవుడూ (Pawan Kalyan as God) అంటూ అభిమానాలు చెబుతూ ఉంటారు. సామాన్య మహిళా కూడా నేను వీర మహిళను, సేనాని వెంట నడిచే ధీర మహిళను అంటూ పవన్ కళ్యాణ్ వెంట నడస్తూ ఉంటారు. యువత సేనాని అంటే ప్రాణం, ఇష్టం అంటూ అంటారు. పండు ముసలివాళ్ళు సైతం పవన్ పవన్ అంటూ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇది నీకే సాధ్యం అని సోషల్ మీడియా కోడై చూస్తున్నది. అందుకేమో పాలకులకు పవన్ కళ్యాణ్ అంటే భయం? 

ఆ తల్లీ బిడ్డలా చుట్టూ చలి-పోలీసులు అయినను…

అందుకేనేమో రెండు-మూడు సంవత్సరాల బిడ్డను వడిలో వేసికొని, కటిక చలిలో పవన్ కళ్యాణ్ కోసం ఒక నిరుపేద తల్లి నిరీక్షిస్తున్నది. పోలీసులు బందిస్తారేమో అనే భయం కానీ, బిడ్డకి చలి కీడు చేస్తుందేమో అనే భయం కానీ లేకుండా సేనాని కోసమే నా నిరీక్షణ అంటున్నది. ఇది రేపటి తరాల భవిత కోసమే అంటూ ఆ ధీర మహిళ జనానికి అండగా నిలుస్తున్నది. కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, మేధావులు, బాధిత వర్గాల ప్రజలు అందరూ కూడా సిగ్గుపడేలా ఆ నిరుపేద తల్లీ బిడ్డలు చేస్తున్నారు. హాట్స్ ఆఫ్ తల్లీ అని అనక మానదు.

శబాష్ పవన్ కళ్యాణ్! నీకు ఆ కుర్చీ ఎప్పుడు దక్కుతుందో లేదో తెలీదు. కానీ మా హృదయంలో నీకు పదిల స్థానాన్నిఇచ్చాము. మేమెప్పుడూ నీ కోసమే అంటూ లక్షలాది మంది సేనాని కోసం నిరీక్షిస్తున్నారు అని చెప్పాలి. వేలాది మంది నోవాటెల్ హోటల్ ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇది అంతా మార్పు కోసమే. మా బిడ్డల భవిత కోసమే అనే ప్రజల గుండె చప్పుడుని ఏ ప్రభుత్వాలు అడ్డుకోలేవేమో కదా.

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం

ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఆర్ధిక సాయం (Financial Assistance) అందించారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు చెక్కులను బాధిత కుటుంబాలకు ఇచ్చారు.

ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యులకు షెడ్యూల్ ప్రకారం జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందచేయాల్సి ఉంది. సభలు, సమావేశాలు పెట్టడానికి వీల్లేదంటూ పోలీసులు పవన్ కళ్యాణ్ మీద ఆంక్షలు విధించిన క్రమంలో ఆ నోటీసులు స్వీకరించే ముందే మీడియా ఎదుట చెక్కులు పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన 9 కుటుంబాలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెండు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేశారు.

ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు జనసేన పార్టీ భవిష్యత్తులోనూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ. 5 లక్షల చెక్కులు స్వీకరించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాల వివరాలు..

1. దుర్గాసి హేమలత (దుర్గాసి దేవేంద్ర)
2. హనుమంతు శాంతమ్మ (హనుమంతు ఢిల్లీశ్వరరావు)
3. సంగారెడ్డి అరుణ (సంగారెడ్డి గంగరాజు)
4. బోరా మోహిత్( బోరా వెంకటలక్ష్మి)
5. మోటూరి రాజేశ్వరి(మోటూరి గోవిందు)
6. పవడా జెన్నిఫర్(పవడా రమణకుమార్)
7. గొంతిని దేవి(గొంతిని శ్రీను)
8. పి. కృష్ణవేణి(పాతల అప్పారావు)
9. కుంచా నూకరాజు(కుంచా నూకరాజు)
10. అనిశెట్టి రాజేశ్వరి(అనిశెట్టి శివ)
11. సీతంరెడ్డి భాగ్య(సీతంరెడ్డి రాంబాబు)
12. మల్లిరెడ్డి సత్యవతి(మల్లిరెడ్డి పద్మనాభం)

నిగ్రహాన్ని ప్రదర్శిస్తున్న జనసేనాని