Pawan thinkingPawan thinking

కౌలు రైతు భరోసా యాత్రలో స్వల్ప మార్పులు అవసరం

జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యణ్ (Pawan Kalyan) చేపట్టిన కౌలురైతు భరోసా యాత్ర (Kauku Rythu Bharosa Yatra) విజయవంతం అయ్యింది. కరుడుగట్టిన పవన్ విమర్శకుల నుండి కూడా కౌలురైతు భరోసా యాత్రపైనా, పవన్ నాయకత్వంపైనా (Pawan Leadership) ప్రసంశలు రావడం మొదలు అయ్యింది. కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వాలు మఖం చాటేసినా గాని మాకు పవన్ (Pawan) ఉన్నాడు. మమ్ములను ఆదుకొంటాడు. మా బిడ్డలను చదివిస్తాడు అనే భరోసాని పవన్ బాధిత కుటుంబాల్లో కల్పించాడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కోటికొక్కరు ఉంటారేమో.

అయితే పవన్ మంచితనం పార్టీకి ఎంత ఎంత వరకు ఉపయోగపడుతున్నది అనేదే శేష ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఇదే నేటి వ్యాసం యొక్క సారాంశం కూడాను.

తన కుటుంబ పోషణార్ధం, పార్టీ నడపడం కోసం అవసరమయ్యే డబ్బులు కోసం ముఖానికి రంగులు పూసుకొని నటనను కొనసాగిస్తున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పగలు నటిస్తూ, రాత్రులు పార్టీ కోసం చర్చలు జరుపుతూ కుటుంబాన్ని, పార్టీని నెట్టికొస్తున్నాడు.

వేలకు వేల కోట్లు దోచుకొన్న నాయకులు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసి ప్రజలకు సాయం చేయడం లేదు. కానీ కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా కోట్లకు కోట్లను ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉన్నాడు.

ఆత్మహత్యలు (Suicides) చేసికొన్న రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం సుమారు 10 కోట్లు వరకు (టూర్ ఖర్చులతో సహా) తన సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నాడు.

మొన్న ఒక్కరోజునే 33 లక్షల చెక్కులను బాధిత కుటుంబాలను అందించాడు. అయన ట్రిప్ ఖర్చులు సుమారు 20 లక్షల వరకు ఉండవచ్చు. అంటే ఒక్క రోజులో సుమారు 50 లక్షల బాధితుల కోసం వెచ్చించి వెళ్ళిపోయాడు. ఇక్కడ పవన్ ప్రజలు గురించి ఆలోచించాడే గాని పార్టీ మైలేజ్ గురించి ఆలోచించనే లేదు. ఇదే పవన్ యొక్క గొప్పదనం. కానీ ఈ గొప్పదనం పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేదే నా వ్యాస సారాంశం.

అసలు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏమిటి?

పవన్ కళ్యాణ్ లక్ష్ష్యం (Pawan Kalyan Aim) ప్రజలను ఆదుకోవడమే గాని ప్రజలతో ఆడుకోవడం కాదు. ప్రజలను రక్షించాలి అనే తపనే గాని పార్టీని మైలేజ్’ని ఎలా పెంచాలి అనే ఆలోచన లేని శిబి చక్రవర్తి లాంటోడు ఈ పవన్ కళ్యాణ్ అనిచెప్పాలి. ఇక్కడే అసలు సమస్య వస్తున్నది. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధిపతిగా ఆలోచించడం లేదు. ప్రజల కోసం జీవించే ఒక కర్ణుడు, ఒక ఆపత్భాంధవుడు లానే ఆలోచిస్తుంనాడే గాని పార్టీ గురించి ఆలోచించడం లేదు అని చెప్పాలి. ఇదే నా వ్యాస సారాంశం కూడా.

ఇదే జగన్ – బాబులు చేసి ఉంటే?

పవన్ 33 చెక్కులను ఒక్కరోజులో ఇచ్చేసి వెళ్లిపోయారు. ఇదే పంపణీ జగన్ (Jagan) చేసి ఉంటే ఒక్క పైసా కూడా తన చేతినుండి తీసేవాడు కాదు. అలానే ఒక్క చెక్కు పంపిణీకి రెండు రోజులు చొప్పున 66 రోజులు పాటు ఈ భరోసా యాత్ర తతంగాన్ని జగన్ కొనసాగించే వాడు. పార్టీ మైలేజ్ (Party Mileage) పెరగడానికి జగన్ఈ రెండు నెలలను వాడుకొనే వాడు.

ఇదే పని చంద్రబాబు (Chandra Babu) చేసి ఉంటే ఒక్క పైసా కూడా తన చేతినుండి తీసేవాడు కాదు. అలానే ఒక్కొక్క చెక్కు పంపిణీకి ముందు పది రోజులు, ఆ తరువాత పది రోజులు మీడియాలో చర్చలు వచ్చేటట్లు చూసుకొంటూ ఒక ఆరు నెలలు పాటు ఈ తతంగాన్ని నడిపించేవాడు. తన పార్టీ మైలేజ్ కోసం ఈ యాత్రని వాడుకొని రైతులను మాత్రం గాలికి వదిలేసేవాడు.

కానీ పవన్ చేస్తున్నది ఏమిటి?

కానీ కల్మషం లేని, స్వార్ధం లేని పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కరోజులో 33 చెక్కులను పంచేసేసాడు. సమాజపరంగా ఇది తప్పు కాదు. నేను తప్పు పట్టడం లేదు. కానీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఇది ముమ్మాటికీ తప్పే. ఒక రాజకీయ పార్టీ అధినేతగా పార్టీని గురించి కూడా పవన్ ఆలోచించాలి.

ప్రజల జీవితాలతో “ఆడుకొనే” ఆ రెండు పార్టీల నాటకాలకు ప్రజలు అలవాటు పడ్డారు. పవన్ కళ్యాణ్ ముక్కుసూటితనం, కల్మషంలేని రాజకీయాలు ప్రజలకు వంటపట్టే వరకు  పార్టీ గురించి కూడా పవన్ ఆలోచించాలి.రాజకీయాలు కూడా చేయాలి. రాజకీయ పార్టీ నడపాలి అంటే రాజాకీలు కూడా నేర్చుకోవాలి. జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారు. అది జరగాలి అంటే పార్టీ పటిష్ట పడాలి. దానికి ఇటువంటి సమస్యలను పార్టీకి అనుగుణంగా మార్చుకోవాలి. ఒక యాత్రగా మొదలు పెట్టి ఇచ్చుకొంటూ వెళ్ళినట్లైతే ప్రజల్లో పార్టీ పట్ల, పవన్ నాయకత్వం పట్ల మరింత నమ్మకం పెరుగుతుంది.

భాదితులకే కాదు పార్టీకి కూడా పవనే ఆపత్భాందవుడు

నిత్యం ప్రజలు కస్టాలు గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్’కి ఇది నచ్చక పోవచ్చు. ప్రజలను ఆదుకోవడంలో కూడా పార్టీ మైలేజ్ గురించి ఆలోచించాలా అనే స్వభావం గల వ్యక్తి మన పవన్ కళ్యాణ్. కానీ బాధితులకు ఆపత్భాందవుడిగా ఉండడమే కాదు పార్టీకి కూడా మీరే ఆపత్భాందవుడు. పార్టీ కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి. పార్టీ పటిష్ఠతకు రైతు భరోసా యాత్రని రాష్ట్రము అంతటా కొనసాగించడానికి (33 చెక్కులు ఒక్క రోజులో అన్నట్లు కాదు) ప్రయత్నం చేయండి. ఇది మీ కోసం కాకపోయినా మార్పు కోసం ఎదురుచుస్తున్న ప్రజల కోసం అని భావించండి.

ఆలోచించండి… రాజకీయాలు రానప్పటికీ సొంత డబ్బులతో ప్రజలను ఆదుకొంటున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కోటికొక్కరు ఉంటారేమో (It’s from Akshara Satyam)

పవన్ కౌలురైతు భరోసా యాత్రకు బ్రహ్మరధం