ప్రశ్నించిన వారిపై ఈ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు
ఫీజు రీ ఎంబర్స్మెంట్ రాలేదని అడగడటమే తప్పా?
పూతలపట్టులోని వేపనపల్లి గ్రామ యువకులకు అండగా జనసేన
అక్రమ కేసులు బనాయించడంపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని (SC ST atrocities act) వైసీపీ (YCP) అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ (Non Bailable) కేసులు పెట్టి వారిని వైసీపీ ప్రభుత్వం (YCP Government) వేధిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు (Puthalapattu) నియోజకవర్గం వేపనపల్లి గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా జశ్వంత్ (Jashvanth) అనే యువకుడు ఫీజు రీ యింబర్స్మెంట్ (Fee Reimbursement) రాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. అలా ప్రశ్నించాడు అని అతనితోపాటు ఆయనకు అండగా ఉన్న మరో తొమ్మిది మంది జన సైనికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు రాసి కేసులుపెట్టారు అని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు.
సరైన ప్రాథమిక సాక్ష్యాధారాలు (Witnesses) లేకుండా రిమాండ్ కు తీసుకెళ్లిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి, రిమాండు రిపోర్టును (Remand report) రిజెక్టు చేశారు. అయినా యువకులను ఈ కేసులో ఏదో రకంగా ఇరికించాలని నాయకులు, పోలీసులు (AP Police) కసరత్తులు చేస్తున్నారు అని జనసేనాని ఆరోపించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధం
ప్రజా ప్రతినిధికి కులం, మతం అనేది ఉండదు. కులాల ముసుగులో దాక్కోకూడదు. నియోజకవర్గంలో పని చేయకపోతే ప్రజలు నిలదీస్తారు. ప్రశ్నించినంత మాత్రానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తాం అంటే ఎలా? నిజంగా ఆ యువకులు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలిగానీ, అడ్డగోలుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును ఉపయోగించి వేధిస్తారా? ఈ యాక్ట్ ఎస్సీ, ఎస్టీలను రక్షించడానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ (Ambedkar) గారు తీసుకొచ్చారు తప్ప… మిగతా కులాలను వేధించడానికి కాదు అని జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వివరించారు.
ఇలా అకారణంగా వేధించడం అంబేడ్కర్ (Ambedkar) గారి స్ఫూర్తికి విరుద్ధం. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్ (Human Rights Commission) దృష్టికి తీసుకెళ్తాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును అడ్డగోలుగా ఉపయోగించడంపై లోతుగా అధ్యయనం చేసి, పార్టీ పి.ఏ.సి., సర్వ సభ్య సమావేశంలో చర్చిస్తాం. అకారణంగా పోలీసుల వేధింపులకు గురవుతున్న తొమ్మిది మంది యువకులకు చిత్తూరు జిల్లా (Chittoor District) జనసేన నాయకులు (Janasena Leaders) అండగా ఉండాలని జనసేనాని (Jana senani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోరారు.