Acharya TeaserAcharya Teaser

అందరినీ అలరిస్తున్న ‘ఆచార్య’ టీజర్‌!
అమ్మోతల్లి ఆవహించినట్లే నటించిన చిరుత

ధర్మస్థలికి (Dharmasthali) ఆపదొస్తే అది జయించడానికి అమ్మోరు తల్లి (Ammoru Talli) మాలో ఆవహించి ముందుకు పంపుతుంది అంటూ వచ్చిన ఆచార్య (Acharya) టీజర్ (Teaser) సంచలనం సృష్టిస్తోంది. రామ్‌ చరణ్‌ (Ram Charan), చిరంజీవి (Chiranjeevi) తో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ (Acharya) చిత్రంలోని డైలాగ్‌ ఇది. ఇందులో రామ్‌చరణ్‌ పోషించిన ‘సిద్ధ’ పాత్రకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు.

ఆయన డైలాగ్‌ డెలివరీ, ఆయన లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ధర్మస్థలికి ఆపదొేస్త.. అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్‌ పలికిన సంభాషణలు అభిమానులను అలరించే విధంగా ఉన్నాయి. అభిమానులను ఉర్రుతలూగిస్తున్నాయి. ఇక సిద్థ టీజర్‌ చివరి సీన్‌లో సెలయేరుకు ఒకవైపు చిరుత పులి, దాని పిల్ల, మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో నీళ్లు తాగుతున్న సీన్‌ చూస్తుంటే ప్రేక్షకులకు పండగలాగే ఉంటుంది.

ఇందులో చిరంజీవి సరసన కాజల్‌ (Kajal), చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ (Konidela Production Company) సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Shiva) దర్శకుడు. మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4న సినిమా విడుదల కాబోతున్నది.

కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ మృతి పట్ల చిరంజీవి సంతాపం

Spread the love