Nagababu at KurnoolNagababu at Kurnool

ఏపీని అడుక్కునే స్థితికి తీసుకొచ్చిన ఘనత “వైసీపీ”ది
శవాలపై బొంగు పేలాలు ఏరుకొని తినే రాజకీయం వైసీపీ నాయకులది
కష్టార్జితాన్ని ప్రజలకు పంచే గొప్పగుణం శ్రీ పవన్ కళ్యాణ్’ది
జనసేన పాలనలో రాయలసీమ వలసలు ఆపుతాం
కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశంలో కొణిదెల నాగబాబు

జాతికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా పేరు గాంచిన ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ అడుక్కునే స్థితికి తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) దక్కుతుందని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) వెల్లడించారు. కర్నూలులో శనివారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్’పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు.

శవాలపై పేలాలు ఏరుకొని తినే రాజకీయం వైసీపీ నాయకులది (YCP Leaders). తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచే గొప్ప గుణం పవన్ కళ్యాణ్’ది (Pawan Kalyan) అని అన్నారు. అప్పుల రాష్ట్రంగా పేరు బడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి (Pawan as AP CM) అయ్యాక అభివృద్ధి చేసి చూపిస్తారు. పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే ప్రణాళికలు జనసేన దగ్గర ఉన్నాయని నాగబాబు ఉద్ఘాటించారు.

రాయలసీమలో, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఇటీవల వేల సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోవడం చాలా బాధాకరం. జనసేన అధికారంలోకి వచ్చాక వలస పోవాలనే ఆలోచన, అవసరం కూడా లేకుండా చేస్తామని అన్నారు. వందల సంఖ్యలో హాజరైన వీర మహిళలు, జన సైనికులు వై.సీ.పీ. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల గురించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు సమక్షంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ప్రతీ ఒక్కరి అభిప్రాయం, సమస్యలను విన్న అనంతరం నాగబాబు స్పందిస్తూ కర్నూలులో జరిగిన సమావేశం వివరాలు అన్నీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమన్వయంతో పని చేయాలని కొణెదల నాగబాబు కోరారు.

జనసేన ప్రభంజనం ఆపడం ఎవరి తరం కాదు: కందుల దుర్గేశ్

ఏ విధమైన వ్యక్తిగత లాభాపేక్ష ఆశించకుండా కేవలం ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడానికి పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ ప్రభంజనం ఆపడం ఎవరి తరం కాదు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత వీర మహిళలు, జన సైనికులు తీసుకోవాలి. సలహా దారుల దగ్గరనుంచి భూ కబ్జాల దాకా న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వంగా వైసీపీ నిలిచిపోతుంది అని తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధినేత కందుల దుర్గేష్ అన్నారు.

మనకు రక్షణగా వచ్చిన జనసేనానిని మనం కాపాడుకోవాలి: చిలకం మధుసూధన్ రెడ్డి

మనకు రక్షణగా వచ్చిన పవన్ కళ్యాణ్’ని మనం కాపాడుకోవాలి. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ అనే పదాన్ని ప్రచారం చేసుకుంటున్న సంప్రదాయ రాజకీయ పార్టీలను ఇంటికి పంపాలి. జనసేన అధికారంలోకి వచ్చాక రాయలసీమ అంటే ప్రేమ, అభిమానం, ఐకమత్యం అని చేసి చూపిస్తామని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి అన్నారు.

జన సైనికులు, వీర మహిళల పోరాటానికి వైసీపీ దిగి రావాల్సిందే: యశస్వినీ

జన సైనికులు, వీర మహిళల పోరాటానికి వైసీపీ తప్పనిసరిగా దిగి రావాల్సిందే. జన సైనికులు, వీర మహిళలు చేసే పోరాటానికి న్యాయపరంగా ఏవన్నా అడ్డంకులు ఏర్పడితే జనసేన లీగల్ సెల్ సహాయం ఉంటుంది. కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేయాలి అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వినీ అన్నారు.

ఏపికి కాబోతున్న ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్: కూసంపూడి శ్రీనివాస్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోతున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలిసి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే తమ మూలాలు కదిలి పోతాయనే అభద్రతా భావంతో వైసీపీ నాయకులు జనసేనపై, పవన్ కళ్యాణ్ గారిపై మాటల దాడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో జనసేన తప్ప వేరే మార్గం లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ అన్నారు.

వీర మహిళలమంతా సంఘటితంగా పోరాడుదాం: రాయపాటి అరుణ

వై.సీ.పీ. అరాచక పరిపాలనకు స్వస్తి చెప్పి, జనసేన పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా వీర మహిళలమంతా సంఘటితంగా పోరాటం చేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అన్నారు.

క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ఎప్పుడో గెలిచింది: టి.సి. వరుణ్

క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో జనసిన ఎప్పుడో గెలిచింది. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసిన గుర్తొస్తోంది. అడిగితే విననప్పుడు పోరాడి సాధించుకోక తప్పదని అనంతపురం జానపర్తి అధ్యక్షులు టి.సి. వరుణ్ అన్నారు.

ఓట్ల శాతం పెంపొందించడంపై దృష్టి పెట్టాలి: కళ్యాణ్ దిలీప్ సుంకర

జన సైనికులు, వీర మహిళలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే ఓట్ల శాతం పెంపొందించడంపై కూడా దృష్టి పెట్టాలి. విలాసవంతమైన జీవితాన్ని త్యజించి ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్’ని గెలిపించుకోవాలి. పోలింగ్ కేంద్రాలే లక్ష్యంగా జన సైనికులు, వీర మహిళలు పని చేయాలని కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నారు.

ప్రజాధనం దోచుకోవడమే వైసీపీ లక్ష్యం:మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు

ప్రజలు నమ్మి అప్పజెప్పిన బాధ్యతను అడ్డం పెట్టుకొని ప్రజాధనం దోచుకోవడమే లక్ష్యంగా వైసిపీ పని చేస్తోంది. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రోజు పది శాతం పాలకుల ఇంటికి తరలి వెళ్లిపోతోంది. ప్రజా సేవ కోసం కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని వచ్చిన పవన్ కళ్యాణ్’ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు.

స్థానిక నాయకులు సురేష్, అర్షద్, రేఖ గౌడ్, హసీనా, పవన్ కుమార్, ఆయా నియోజకవర్గాల బాధ్యులు, జనసేన ప్రోగ్రామ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యడవల్లి విశ్వనాథ్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు సమావేశం నిర్వహణలో ముఖ్య భూమిక పోషించారు. రవికుమార్, మల్లప్ప, వెంకప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చీమల పుట్టలకై కాపు కాసిన విష సర్పాలు!