Common manCommon man

దేశం కోసం (For the country) అంటూ ఒకరు, అణగారిన వర్గాల కోసం (Suppressed classes) మద్దతు నిస్తాం అంటూ మరొకరు పువ్వు (Puvvu) వెంట పడ్డారు.

ఫ్యాన్ (Fan) కింద సేదతీరుతున్న పువ్వు (Flower) కూడా సైకిల్ (Cycle) ప్రేమని – ఫ్యాన్ అవసరాన్ని కాదనలేక పోయినట్లు అనిపిస్తున్నది. 

అందుకేనేమో ఆ ముగ్గురూ మళ్ళీ ఇష్టపడ్డారు. కష్టాల్లో కలుసుకున్నారు. ఇదే వాళ్ళ స్వార్ధం కాదు. దేశం కోసమే అని నమ్మక పోతే మన సోదరులే మన మీద విరుచుకు పడతారు!

ఇదే పవన్ (Pawan Kalyan) పువ్వుకి మద్దతునిస్తే పవన్ దత్త పుత్రుడు (adopted son) అయిపోతాడు. కానీ ఫ్యాన్ గాని సైకిల్ గాని పువ్వుకి మద్దతునిస్తే దేశం కోసం, అణగారిన వర్గాల కోసం అని మనం సరిపెట్టుకోవాలి. సంకలు గుద్దుకొంటూ ఇష్టపడ్డ ఆ ముగ్గురు తరపున ప్రచారం మొదలు పెట్టాలి. పెట్టేస్తాం కూడా.

ఇదే పువ్వు సైకిల్’తో పొత్తు పెట్టుకొంటే రాజకీయ వ్యూహం (Political Strategy) అని సరిపుట్టుకొవాలి. ఇదే ఫ్యాన్ పువ్వుకి మద్దతు నిస్తే రాజకీయ చతురత అంటూ మనమే కితాబు నిస్తాం. కానీ పవన్ సైకిల్’కి మద్దతు నివ్వక పోయినాగాని పవన్ అమ్ముడు పోయాడు (Sold Leader) అంటూ మనమే ఇష్టపడ్డ ఆ ముగ్గురు తరపున ప్రచారం మొదలు పెట్టేస్తాం.

ఆ ముగ్గురు కలయిక ఇదే మొదటి సారా?

మొన్నటి సాధారణ ఎన్నికల ముందు కూడా పువ్వు, ఫ్యాన్, సైకిల్ రహస్యంగా కలిసి పవనాలను (Pavanalu) ఓడించి ఉంటాయి అని మనకు తెల్వదు. తెలిసినా మనం అర్ధం చేసికోలేము.

మొన్నటి సాధారణ ఎన్నికలు (General Elections) అయినా తరువాత ఈ ముగ్గురు విడిపోయినట్లు నటిస్తూ మన చెవుల్లో క్యాబేజీ పువ్వులు (Cabbage) పెట్టడం మొదలు పెట్టారు. మన చెవిలో ఆ క్యాబేజీ పువ్వులను పెట్టుకొని ఆ ముగ్గురు విడిపోయారు అని ప్రచారం మనమే చేసేస్తాం.

రేపు హస్తిన ఎన్నికలు అయిన తరువాత మరల ఆ ముగ్గురు తిట్టుకొన్నట్లు నటిస్తూ మన చెవుల్లో మరల క్యాబేజీ పువ్వులు పెట్టడం మొదలు పెడతారు. నిజమే నంటూ నమ్మేసి నట్టేట మునిగిపోతాం కూడా.

రాబోయే ఎన్నికల్లో మరల ఆ ముగ్గురు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి మరల పవనాలను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు.  దీని గురించి మనలను ఆలోచించుకునే అవకాశం మన సోదరులే మనకి ఇవ్వరు. 

మనం కూడా నిజాలు తెలిసికోకుండా పువ్వు కోసం కొందరు, ఫ్యాన్ కోసం కొందరు, సైకిల్ కోసం మరికొందరు ప్రాణం పెడతాం. ఆ ముగ్గురిని కాపలా కాయడం కోసం మనలో మనమే తిట్టుకు చస్తాం. మార్పు కోసం వస్తున్న పార్టీలను, నిస్వార్ధ నాయకుడిని ఓడించడానికి
సిద్ధమవుతూ మన సమాధులను మనమే తవ్వుకొంటూ ఉంటాం.

మన కుల నాయకులు, కుల సంఘాలు ఆ తాయత్తు మహిమ నుండి మనలను బయట పడనివ్వరు అని నిజాన్ని నేటి యువత (Youth) తెలిసికొనేది ఎప్పుడు? ఇది పచ్చి అవకాశవాద రాజకీయమా (Opportunistic Politics) లేక మరేదైనానా? అసలు ఏది నిజం. ఏది అబద్ధం అనే వాస్తవాలను మన యువత అవలోకనం చేసికొనేది ఎప్పుడు.

ఆలోచించండి… వేటగాళ్ల కలయిన వారి వారి ఆసరాల కోసమే గాని మన కోసమో లేక మన బిడ్డల భవిత కోసమో కాదేమో? (It’s from Akshara Satyam)

(ఇది ఊహించి రాసిందే తప్ప ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదు)

జగన్ ప్రభుత్వానికి షాకింగ్ సర్వే రిపోర్ట్
సీఎన్ఓఎస్ తాజా నివేదికలో జగన్ రాంక్ 20

Spread the love