PK Visakha ukkuPK Visakha ukku

విశాఖ ఉక్కు (Visakha Steel Plant) పరిరక్షణ డిజిటల్ ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. జనసైనికులు (Janasainiks), విశాఖ ఉక్కు (Visakha Steel) అభిమానులు చేసిన ట్విట్టర్ వార్ (Twitter war) హోరెత్తింది. జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ (Privatization) వద్దు అంటూ ట్విట్టర్’లో స్పందించారు. దీనికి అన్ని వర్గాల వారు, జనసేన నాయకులు (Janasena Leaders), జన సైనికులు, వీర మహిళలు (veera Mahila) విశేషంగా భాగం పంచుకొన్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 10 గంటలకే

#Raise_Placards_ANDHRA_MP, #SaveVizagSteelPlant హ్యాష్ ట్యాగ్ లతో కూడిన ప్లకార్డు, విశాఖ ఉక్కు (Visakha Ukku) ఆంధ్రుల హక్కు (Andhrula Hakku) అనే నినాదంతో కూడిన ప్లకార్డుని ట్విటర్ లో పోస్టు చేసి డిజిటల్ ఉద్యమానికి జనసేనాని (Janasenani) శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మన రాష్ట్ర లోక్ సభ సభ్యులు (Lok sabha members), రాజ్యసభ సభ్యులకు (Rajya sabha members) బాధ్యత గుర్తు చేస్తూ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ ట్వీట్స్ చేశారు. ఎంపీలకు ట్యాగ్ చేస్తూ ఈ డిజిటల్ క్యాంపైన్ ను దిగ్విజయంగా నడుస్తోంది. #Raise_Placards_ANDHRA_MP, #SaveVizagSteelPlant హ్యాష్ ట్యాగ్ ల ద్వారా మొదలైన ఈ డిజిటల్ క్యాంపైన్ 600 మిలియన్లకు రీచ్ అయింది. జాతీయ స్థాయిలో (National Level) ట్విట్టర్ ట్రెండింగ్ లో (Twitter trending) నిలిచింది.

పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గారితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పి.ఏ.సి. సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు, నియోజక వర్గాల ఇంచార్జులు, నాయకులు – విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎంపీలు స్పందించాలని ట్విటర్ ద్వారా కోరారు. విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్ ప్లాంట్ (Steel Plant) ఉద్యోగులు, ప్లాంట్ దగ్గర ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ఎంపీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు.

ఉద్యోగుల ఉద్యమానికి విరామం!