ChanakyaChanakya

Corruption less Corruption Kings in AP

రెండు ఎకరాల బీడుభూమితో రాజకీయాల్లోకి వచ్చిన ఉన్న కాటికి పేద చంద్రుడు నేడు రెండు మూడు సూర్య గ్రహాలనే కొనే స్థితికి ఎదిగాడు.

ఎదిగింది కస్టపడి కాదు. వెన్నుపోట్లు పొడిచి ఎదిగాడు అని అందరికీ తెలుసు. కానీ ఆ పచ్చ చంద్రుడిని తప్పు పట్టలేము. పాక్యేజీ చంద్రుడు అనం సరికదా చాణిక్యుడు అని కితాబు నిస్తాం.

బలిజ సోదరుడు కాలేజీ ఫీజు కడితేనే కానీ చదువుకోలేని వాడు రాజులన్న. 2004 కి ఇల్లు అమ్ముకొంటే కానీ అప్పులు తీరవేమో అని స్థితోలో రాజలన్న ఉండేవాడు అనే ఆరోపణలు ఉండేవి. అటువంటి స్థితి నుండి నేడు సమస్త విశ్వాన్నే కొనే స్థితికి వచ్చింది ఆ రాజులన్న కుటుంబం అనే ఆరోపణలు ఉన్నాయి..

అప్పుల నుండి అపార కుబేరుడు స్థాయికి వచ్చింది కస్టపడి కాదు! ప్యాకేజీలు తీసికొనే అని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. కానీ రాజులన్నని గాని, రాజులన్న కొడుకుని గాని ప్యాకేజీ పుత్రుడు అనం. వీడు మగాడ్రా బుజ్జీ అని మద్దతు నిస్తాం.

పచ్చ చంద్రుడికి రెండు ఎకరాల భూమి ఉన్నప్పుడే అంజనీపుత్రుడు లక్షాధికారి. రాజులన్న అప్పుల్లో ఉన్నప్పుడే అంజనీ పుత్రులిద్దరూ కోటీశ్వరులు.

అంజనీపుత్రులు ఇద్దరూ వెన్నుపోట్లు పొడిచి ఎదగలేదు. పావురాల గుట్ట సమాధులపై ఎదగలేదు. స్వయంకృషితో ఎదుగుతూ సంపాదించారు అని మన అందరికీ తెలుసు.

అయినా అంజనీపుత్రులను మాత్రం ప్యాకేజీ పుత్రులు అని మనమే అంటాం. ఇదీ మన మానసిక దౌర్భాగ్యం. దీనికి కారణం వ్యవస్థల్లో ఉన్న లోపం కాదు. దీనికి కారణం రాజ్యాంగంలో ఉన్న లోటుపాట్లు కాదు. దీనికి కారణం పాలకుల్లో ఉన్న రాక్షసత్వం కాదు.

దీనికి కారణం మనలో ఉన్న పిరికితనం… వాస్తవాలు తెలిసికూడా అర్ధం చేసికోలేని మనలో ఉన్న అజ్ఞానం… దీనికి కారణం మనలో ఉన్న అసూయ… మనం నీతిని గుర్తుపట్టలేక పోతున్నాం. మనం నీతిని మెచ్చుకోలేక పోతున్నావు అంటే దానికి కారణం మనం కూడా ఒక అవినీతి పరులం. దీనికి కారణం మనలో కూడా పాతుకుపోయిన అధర్మం-అవినీతి నేమో?

ఆలోచించండి… పాలకుడు రాక్షసత్వం కంటే ధర్మాత్ముడి మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం. (It’s from Akshara Satyam)

అన్నయ్య చిరు-తమ్ముడు కళ్యాణ్ బాబు ఇద్దరూ దీనికి బాధ్యులే…