Tuni Train IncidentTuni Train Incident

కులాల కార్చిచ్చులో మాడిపోతున్న అణగారిన వర్గాలు
జనసేనాని సాహసంపై విశ్లేషణ

ఆంధ్రలో వీధుల్లో నాట్యం చేస్తున్న కులాల కార్చిచ్చుకు (Caste war) కాస్త ఆజ్యం పోస్తే అధికారం, పదవి ఖాయం. కుల చిచ్చుని ఆర్పాలి అనుకొంటే వాడి పతనం ఖాయం అనేది గత అనుభవాల ద్వారా తెలుస్తున్నది. నేడు వీధి వీధిన కుల చిచ్చు నగ్నంగా నాట్యం చేస్తున్నది. అటువంటి కులపిచ్చిపై మాట్లాడాలి అంటే అంత సులభం కాదు. ఇది తప్పు అని ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడం కూడా సాధ్యం కాదు. అటువంటి కులాల కుంపట్లను నెత్తిని పెట్టుకొంటూ జనసేనాని (Janasenani) తప్పు చేస్తున్నాడా? అసలు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఈ కులాల కురుక్షేత్రానికి (Kurukshetram) ఆద్యులు ఎవ్వరు? బలి అవుతున్నది ఎవ్వరు? జనసేనాని చేస్తున్న సాహసం దీనికి పరిస్కారం చూపగలదా? అనేది ఒక్కసారి చర్చిద్దాం.

యువతకు తెలియని ఒక పచ్చి నిజం

నేటి తరం యువతకు (Youth) తెలియని ఒక పచ్చి నిజం చెబుతున్నాను. నా చిన్నప్పుడు ప్రతీ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా కాపులు (Kapu), బీసీలు (BC), యస్సీ  (SC), యస్టీలు (ST) ఐకమత్యంతో (Unity) ఉండేవారు. ఒకరిని మరోకరు చక్కగా వరుసలు పెట్టి, అన్నయ్యా, బావా, మామ, బాబాయి, అబ్బాయి, తమ్ముడు అంటూ పిలుచుకునే వారు. ఒకరి ఇంట్లో కష్టం వస్తే, అందరు కులాలకు అతీతంగా వచ్చి తమకు తోచిన సహాయం చేసేవారు. సహయం చేయలేనివారు సానుభూతితో అండగా నిలబడేవారు.

అప్పట్లో యస్సీ, యస్టీలను ఊరికి బయట నివాసపరంగా ఉంచినా, వారు లేనిదే ఉరు తెల్లవారేది కాదు. వారు రానిదే పల్లే నిద్ర లేచేది కాదు. చక్కటి సహజీవనం కోనసాగేది.

పచ్చ పార్టీ ఆవిర్భావంతో కులాల కార్చిచ్చు!

కానీ ఎప్పుడైతే పచ్చ పార్టీ (Pacha Party) ఆవిర్భావం జరిగిందో, అప్పటి నుండీ ఐకమత్యంతో ఓట్లేసిన అన్ని వర్గాల్లో కీచులాటలు మొదలు అయ్యాయి. అన్ని వర్గాలను విడదీసి లోబరుచుకోవడం కోసం పచ్చ పార్టీ కులాలను విడదీయడం మొదలు పెట్టింది. తరువాత మెల్ల మెల్లగా కాపులు (Kapulu), బలహీన వర్గాల (weaker Sections) మధ్యన చిచ్చుపెట్టి వారి మధ్య దూరం పెంచడం కూడా పచ్చ పార్టీ మొదలు పెట్టింది. తద్వారా ఓటుబ్యాంకు రాజకీయాలను మొదలు పెట్టింది. యస్సీ, యస్టీలను, బ్రాహ్మణ, వైశ్యు, రెడ్లను, కోంత మేరకు కాపులను కాంగ్రెసు పార్టీ మెల్లగా తనవైపుకు తిప్పుకొంది.

ఇక కులాల సంకుల సమరం మొదలైంది. అప్పుడే కాపు-కమ్మ (Kapu Kamma) అనే విభేదాలు విజయవాడ (Vijayawada) కేంద్రంగా ఏర్పడ్డాయి. అవి చివరకు మొత్తం కోస్తా ఆంధ్ర (Costa Andhra) అంతటా విస్తరించాయి. అది చిలికి చిలికి గాలివానలా రంగా హత్యాకాండ వరకు దారితీసింది. అంతే అక్కడ నుంచి కులాల సంకుల సమరం మొదలైంది. ఈ రాజకీయ నాయకులే కోస్తా జిల్లాలలో కాపు-కమ్మల మధ్య విభేదాలను సృష్టించారు . ఈ కుల చిచ్చులో బీసీలలో ప్రముఖంగా ఉన్న శెట్టిబలిజ/గౌడ కులస్థులను కాపులకు వ్యతిరేకంగా తయారు చేసింది తెలుగు దేశం పార్టీనే. వారు తెలుగుదేశం పార్టీకి అండగా, పెట్టని కోటలా ఉంచుకోవడం ప్రారంభించింది.

అడుగంటిన ఆప్యాయతలు, అనుబంధాలు

అక్కడి నుంచి కులాల మథ్యన ఉన్న అత్మీయ పిలుపులైన అన్నా-తమ్ముడు, బాబాయి-అబ్బాయి, బావా-మరిది, మావా-అల్లుడు, తాతా-మనవడు పిలుపులు మారిపోయినాయి. వీటికి రాజకీయ రంగు పులుముకొన్నాయి. ఈలోపు నూతనతరం రాజకీయాలలోకి రావడం మొదలు అయ్యింది. దీనితో గతకాలపు అనుభంథాలు పూర్తిగా మరిచిపోవడం మొదలు అయ్యింది. అప్పటినుండి ఏరా, ఓరేయ్, నాకోడకా, నీయమ్మా, నీయక్కా, లాంటి పిలుపులు మొదలైనాయి. వీటితోపాటు గ్రామీణ వైవిథ్య కులాల వృత్తులు కూడా అథునీకరణతో కుదైలైపోయినాయి.

శరాఘాతంగా మారిన కులాల కుంపట్లు

ఈ రకంగా కులాల కుంపట్లు గ్రామీణ అంథ్రాలో రాజేయబడి, నేడు గజ్జే కట్టి నాట్యం చేసి, చివరకు రాష్ట్ర అభివృద్ధి, ఎదుగుదలకు శరాఘాతంగా మారాయి. చివరకు మన కులం వాడా కాదా అనే స్థాయిలో అలోచనలు వచ్చాయి. మనవాడైతే గుణం లేకపోయినా పర్వాలేదు అంటూ నేరస్తులకు, అరాచకవాదులకు, అసాంఘిక శక్తులకు రాజకీయ అథికారం కట్టబెట్టటం జరుగుతున్నది. అందుకే నేడు మనం దుర్భరమైనఈ పరిస్థితిని అనుభవిస్తున్నాము.

చివరకు ఈ ఆధిపత్య కులపిచ్చి ఎటువంటి పతాక స్థాయికి వెళ్లిందో తెలుసా? నేటి కమ్మ యువత, తాము అథికారం అనుభవించటానికే పుట్టామని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా చెప్పటం జరిగింది. ఇక రెడ్లు అనే వారి యువత కూడా అదే మూసలో అలోచనలు మొదలు పెట్టారు. అందుకే నేడు విభజిత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా దెబ్బతిని పోయింది.

నాటి పచ్చ బాబు, రాజన్న దగ్గర నుంచి నేటి దొడ్డ పాలకుడు వరకు ఈ కులాల కుంపట్ల రాజేతలకు కారకులు అనేది నిజం అని యువత తెలుసుకోవడం మొదలు పెడుతున్నది.

చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా సామాజిక సాథికారికత?

గతంలో చిరంజీవి (Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam) ద్వారా సామాజిక సాథికారికత కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 294 స్థానాలలో 104 స్థానాలను కేవలం బలహీన వర్గాల వారికి మొట్టమొదటి సారిగా చిరంజీవి ఇచ్చారు. కానీ అతని పైన కాపు (Kapu) కుల ముద్ర వేసి, చంద్రబాబు (Chandra babu) – రాజశేఖరరెడ్డి (Raja Shekar Reddy) కుట్రపన్నారు, విజయం సాథించారు. అలాగే జనసేన పార్టీ (Janasena Party) పైన కూడా అటువంటి కుల ముద్ర వేయటానికి చంద్రబాబు-జగన్ రెడ్డి ప్రయత్నించారు.ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అణగారిన వర్గాలకు మాత్రమే కుల ముద్ర వేస్తూ వారు సఫలం అవుతూనే ఉన్నారు.

ఇవన్నీ పవన్ కళ్యాణ్’కి (Pawan Kalyan) తెలుసు. వీటిని ముట్టుకొంటే ఏమవుతాదో కూడా జనసేనాని తెలుసు. అయినా ఐదు దశాబ్దాల క్రితం ఉన్న నాటి గ్రామీణ బంథాలు, అనుభంథాలు, ఐకమత్యం, కలివిడితనం గురించి ప్రస్తావన చేయటం మొదలు పెట్టారు. అందులో భాగంగా కులాల ఐకమత్యం గురించి ప్రస్తావన, ప్రతీ కులం పేరు తీసుకోని మాట్లాడటం చేస్తూన్నారు.

కులాల మథ్యన ఐక్యత తేవాలంటే, కులాల ప్రస్తావన ఖచ్చితంగా చేయాల్సిందే. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల పక్షపాతి అని అనుకుంటే తప్పు అవుతుంది. అటువంటి కుల ముద్ర మరలా బలంగా జనసేనాని పైన వేయటానికి యుశ్రారైకాపా, తెదేపా పార్టీలు కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తున్నది.

కానీ పవన్ కళ్యాణ్ చెబుతున్నది ఏమిటో తెలుసా?

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు ముందుగా తాము ఐక్యంగా ఉండాలి. తరువాత మిగిలిన కులాల వారిని ఒక పెద్దన్నలా అక్కున చేర్చుకోవాలి. “ఆ రెండు కులాల” పెద్దల మథ్యన దాగున్న అధికారాన్ని ఐక్యంగా సాధించాలి. వారి కోటలు బద్దలు కోట్టి, రెండు కుటుంబాలు మథ్యన ఇరుక్కున్న అథికారాన్ని వీరు అంతా దక్కించుకోవాలి. ఇలా తాము అందరూ ఐకమత్యంతో రాజకీయ సాథికారికత సాధించాలి. కాపు, దళిత, బీసీ తదితర వర్గాలు రాజ్యాధికారం దిశగా పయనించాలి. తద్వారా అర్థిక పుష్టి సంపాదించలి. అలానే నాటి గ్రామీణ జీవితపు మథురిమలు, అప్యాయతలు, అనుభంథాలు తిరిగి పునఃపెంపొందించడానికి కృషి చేసికోవాలి అనేదే జనసేనాని తపన. ఆవేదన. సమాజ శ్రేయస్సు కోసమే చేస్తున్న సామాజిక ప్రయోగం ఇది అని మాత్రమే అలోచనలు చేయండి. పచ్చ, నీలి పార్టీల, మీడియా విషపు ప్రచారంకి గురి కావద్దు. వారి ప్రచారాలకు మరిక్కసారి. మీ సాధికారిత దిశగా వస్తున్న అవకాశాన్ని వదులుకోవద్దు. ఆలోచించండి.

Gandhi Jayanthi Special

–శాంతి ప్రసాద్ శింగలూరి (Shanthi Prasad Singaluri), న్యాయవాది, జనసేన లీగల్

One thought on “సమాజ శ్రేయస్సు కోసమే సేనాని ప్రయోగం: శాంతి సందేశం”
  1. శాంతి ప్రసాద్ గారు చాలా చక్కగా విపులంగా కులాల కుమ్ములాటలు గురించి వివరించారు. ఇలా ఏదో ఒక్కసారి ఇలా అంటే సరిపోదు మీ అభిప్రాయాలు, ఆలోచనలు ప్రతి ఆంధ్రుడుకి చేరేలా చూడాలి మీ కష్ఠానికి అందరి మద్దతు ఉంటాది. జై పవన్ జై జనసేన జై ఆంధ్రప్రదేశ్ జై భారత్

Comments are closed.