ఏపీ ప్రభుత్వ (AP Government) చెత్త విధానాలపై (Waste Policies) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ (Twitter) వేదికగా విరుచుకుపడ్డారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం జగన్ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకొంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు.. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని సిటీలోని చెత్తను తెచ్చి, దుకాణాల ముందు వేసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే!! అంటూ పవన్ ఘాటుగా విమర్శ చేశారు.
ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ (Kakinada Municipal Corporation) వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఏపీ ప్రభుత్వ ఆలోచన ఉంది అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.