ప్రత్యేక హోదా, పోలవరం, మౌలిక సదుపాయాల కల్పన ప్రస్తావనలేదు
మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు పెంచాలి
జాతీయ ఆరోగ్య మిషన్‌కు మరిన్ని నిధులివ్వాలి
ఉపాధిహామీపథకం, ఎరువులు, ఆహారసబ్సిడీలో కోత
రాష్ట్రాల రుణసేకరణ పరిమితులను పెంచాలి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రయోజనాలను కేంద్ర బడ్జెట్ (Central Budget) విస్మరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి (Finance Minister) బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర బడ్జెట్‌లో విస్మరించడం తీవ్ర నిరాశ పరిచిందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status), పోలవరం (Polavaram), మౌలిక సదుపాయాల (Infrastructure) కల్పన, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించక పోవడం పట్ల కూడా ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటుందన్నారు. కానీ, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడం సమంజసం కాదని బుగ్గన అన్నారు.
కరోనా పరిస్థితులు, పరిమిత వనరులు, రుణాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు (State Governments) కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు, రుణ సేకరణకు పరిమితులు పెంచి ఉంటే బాగుండేదని అయన తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఎరువులు, ఆహార సబ్సిడీ (Food subsidy) తదితర వాటిలో రాష్ట్రాలకు కేంద్రం కోత విధించింది అని బుగ్గన అన్నారు. జలజీవన్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్ (Covid) పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం సరిపోవని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు (Arogya Mission) మరిన్ని నిధుల అవసరం ఉందన్నారు.
జాతీయ రహదారులకు నిధులు రెండింతలు చేయడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు పెట్టుబడి నిధులను రూ.లక్ష కోట్లకు పెంచడం హర్షణీయం అని అయన అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు అనే ఏడు రంగాలను చోదక శక్తులు (Growth engines)గా చేసుకొని జాతీయ మాస్టర్ ప్లాన్ (Master Plan) రూపొందించడం శుభపరిణామం అని అన్నారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేలా తగినన్ని నిధులు కేటాయిస్తే జాతి నిర్మాణంలో రాష్ట్రాలు మరింత సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అత్యవసర పరపతి హామీ పథకాన్ని 2023 మార్చి వరకు పొడిగించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం కోసం పరపతి మొత్తాన్ని పెంచడం ఆర్థిక వృద్ధికి సహకరిస్తుంది అని అన్నారు.
బడ్జెట్ ఆశాజనకంగా లేదు: చంద్రబాబు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఆయన స్పందించారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్’లో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. బడ్జెట్‌లో ఏపీ ప్రయోజనాలను సాధించడంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. 28 మంది వైసీపీ (YCP) ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని బాబు దుయ్యబట్టారు.
ఎఫ్‌ఆర్‌బీఎంపై కేంద్రానికి ఒక రూలు-రాష్ట్రానికి మరో రూలా:విసారే
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కేంద్రం దాటవచ్చు. కానీ రాష్ట్రాలు దాటకూడదా అని వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ప్రశ్నించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా అని నిలదీశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కేంద్రానికైనా, రాష్ట్రానికైనా ఒక్కటే అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2022–2023 ఆర్థిక బడ్జెట్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ బడ్జెట్ ఏపీకి ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. 2021–2022లో గ్రోత్ రేట్ పరిశీలిస్తే 9.2 శాతం ఉందని బడ్జెట్‌లో చెబుతున్నారు. కరోనా సమయంలో ఇంత శాతం అంటే అభినందించాలి. 6.9 శాతం నుంచి 6.4 శాతం వరకు తగ్గిందని ఫిజికల్ డెఫిసిట్ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో ఏపీకి ఎఫ్‌ఆర్‌బీఎం (FMRBM) లిమిట్‌ను 3 శాతంగా బారో చేశారు. దాన్ని మన లిమిట్ కన్నా తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని పీఎం దృష్టికి తీసుకెళ్లాం. బడ్జెట్ 2020–2021లో పీజికల్ డెఫిసిట్ (Fiscal Deficit) 9.3 శాతం. 2021–2022లో 6.9 శాతం..ఇప్పుడు 6.4 శాతంగా చెబుతున్నారు అని విజయ సాయి విమర్సించారు.