Raghu Rama Raju-in courtRaghu Rama Raju-in court

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు (Raghu Rama Krishna Raju) గుంటూరు సీఐడీ న్యాయస్థానం (CID Court) 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయనను రిమాండ్‌కు ఈ నెల 28 వరకు తరలించాలని ఆదేశించింది. ఆయన కాళ్లకి గాయాలు ఉండటంతో ఎంపీని ఆస్పత్రికి తరలించాలని, ముందుగా జీజీహెచ్‌, ఆ తర్వాత రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని కోర్టు సూచించింది. రఘురామ రాజు కోలుకొనే వరకు ఆస్పత్రిలో ఉండొచ్చని కూడా తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని న్యాయస్థానం తెలియ జేసింది. రఘు రామ రాజు శరీరంపై కనిపిస్తున్న గాయాలపై  నివేదిక కావాలని కోర్టు కోరింది. రెండు ఆస్పత్రుల్లో మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు కోర్టు ఆదేశించింది.

అంతా కట్టుకథ – ఏఏజీ

ఇది ఎలా ఉండగా ఎంపీ రఘురామ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు అడ్వొకేట్‌ జనరల్ (ఏఏజీ) పి సుధాకర్‌ రెడ్డి అన్నారు. బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు (High Court) తోసిపుచ్చిన తరువాత మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం కూడా తెచ్చారని వివరించారు. అయితే అప్పటివరకు ఆయన మామూలుగానే ఉన్నారని, పిటిషన్‌ డిస్మిస్‌ అయినా తరువాతనే కొత్త నాటకానికి తెర లేపారని చెప్పినట్లు తెలుస్తున్నది. 

Spread the love