TaxTax

Q1 లో రూ 1 ,85 ,871 కోట్ల వసూలు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (Direct Tax collection) భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు (ఏప్రిల్‌- జూన్‌ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల వరకు ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 లోని ఇదే సమయంలో వసూలైన రూ.92,762 కోట్లతో పోలిస్తే. ఈ వసూళ్లు ఈసారి భారీగా పెరగడం గమనార్హం.

అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ (Lock Down) పరిణామాలు అన్న సంగతి తెలిసిందే. అందువల్ల నాడు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా నమోదైన విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ సంవత్సరము ఏప్రిల్‌- జూన్‌ 15 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (Corporate Income Tax) వసూళ్లు రూ.74,356 కోట్లుగా ఉన్నాయి. అలానే వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.92,762 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,731 కోట్లను రిఫండ్‌లుగా ఇప్పటివరకు ఇచ్చామని సీబీడీటీ (CBDT) తెలియజేసింది.

Spread the love