జిందాబాద్… జిందాబాద్!!! కాపు నాయకులు జిందాబాద్!!!
కాపు కాసేవారి (Kapu) ఆత్మాభిమానాన్ని(Self Pride) భలే చౌక బేరం అంటూ అమ్మకానికి పెట్టేస్తున్న ప్రశ్నించలేక పోతున్న”కమ్మని దొడ్డలకు కాపుకాసే” పెద్దాయన. పదవులను అనుభవిస్తున్న కాపు కాసే నాయకులు (Kapu Leaders)? వీరి అడ్డాలోనే వీరికి రిజర్వేషన్ (Kapu Reservations) ఇవ్వలేను అన్న నాయకుడికి ప్రశ్నించలేని కాపు కాసేవారు? కాపులకు బీసీ కేటగిరీని (BC Status) తీసేసిన ముఖ్యమంత్రిని నిలతీయలేని కాపు కాసేవారు? కొన్ని ప్రభుత్వ పథకాలకు వీరు అర్హులు కారు అని అన్నప్పుడు కూడా ప్రశ్నించలేని కాపు కాసేవారు?
రాజన్న రాజ్యంలో కాపు కాసేవారికి ఎక్కడ అగ్ర తాంబూలం దక్కింది అని ప్రశ్నించలేని కాపు కాసేవారు? కార్పొరేషన్ (Kapu Corporation) నుండి వీరికి ఎంత ప్రయోజం దక్కిందో తెలిసికోలేని కాపు కాసేవారు? జలాభాలొ ముప్పై శాతం ఉండి కూడా మూడు పవర్’లేని పదవులకు దాసోహం అంటున్న కాపు కాసేవారు? వీరి వనభోజలాలకు అన్య కులస్థులను పిలిచి కాపు కాసేవారి పరువు తీస్తారా అని అడిగినవారిపై నోరొత్తి పడిపోతున్నారు. అయినా వీరి నాయకులను నిలబెట్టి అడగడం కాపు కాసే వారికి చేతకాదు?
కమ్మని (Kammani) వారిపై మాత్రమే ఉద్యమాలు చేసే నాయకులూ దొడ్డలపై ఎందుకు చేయరు అని వీరిని అడగ లేక పోతున్నారు? కాపు కాసేవారి మనుగడ పెనం మీద నుండి, పొయ్యిలోకి పడిపోయింది అని తెలిసినా కూడా నోరెత్త లేకుండా పోతున్నారు? ఒక్కొక్క కాపు కాసే వారి సంఘం ఒక్కొక్క పాలక పార్టీకి అమ్ముడుపోతున్నారు అనే ఆరోపణలపై కూడా కాపు కాసేవారి స్పందించరు?
ఉల్లిపాయ అంత కాపు కాసేవాడు ఉంటే వూరు అంతా చేటు అని దొడ్డలు ట్వీట్లు పెట్టినప్పుడు కూడా కౌంటర్ ఇవ్వడం కాపు కాసే వారికి రాదు? పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) పావలా కళ్యాణ్ (Pavala Kalyan) అని ఎగతాళి చేసినప్పుడు కూడా వీరికి చలనం రాదు?
కాపు కాసేవారిపై మచ్చపడ్డ తుని దుర్ఘటనపై (Tuni Incident) విచారణ జరిపించండి అని కాపు కాసేవారు అడగ లేరు? కాపుకాసేవారి రిజర్వేషన్స్ ఇష్యూ ఏమి అయినది అని నోరెత్తి ఒక్క ప్రెస్ మీటు కూడా వేరు పెట్టలేరు?
కానీ కానీ కానీ కానీ…..
రెడ్డి గారిని జగన్ రెడ్డి (Jagan Reddy) అని పవన్ కళ్యాణ్ సంభోధిస్తే మాత్రం కాపు కాసే వారిలో పౌరుషం పొడుచుకొస్తుంది. చలించి పోతుంటారు? చలించి పోవడమే కాదు పవన్ కళ్యాణ్’పై కాపు కాసే వారి పార్టీ అని ముద్రవేసి వేస్తుంటారు? తమ అణగారిన వర్గాల నుండి వస్తున్న పార్టీల్లో ఉన్న నాయకులను దూషిస్తూ ప్రెస్ మీటు మీద ప్రెస్ మీటు పెడుతుంటారు. తమ యజమానులను పూజిస్తూ అణగారిన వర్గాల పార్టీలను దూషిస్తూ ఉంటారు? తమ యజమానులు అభివృద్ధిపై ఉన్న మక్కువ తమ జాతి మనుగడపై ఉండడం లేదు అనే చేదు నిజాన్ని తెలియ నివ్వరు?
అన్ని నిజాలను తెలిసికొని అటువంటి వర్గ ద్రోహులను నియంతరించలేని స్థితిలో “కాపు ముద్ర” (Kapu Mudra) ఉద్యమ నాయకుడు ఉన్నాడు. ఈయన ఉన్నదీ జాతి కోసమా లేక జాతిని అణచివేస్తున్న తమ యజమానుల కోసమా అని కాపు కాసే యువత కూడా తెలిసికోలేదు?
జిందాబాద్… జిందాబాద్!!! కాపు నాయకులు జిందాబాద్!!!
కమ్మని పాలకులపై ద్వేషంతో మాత్రమే ఉద్యమాలు చేసే కాపుకాసే నాయకులు జిందాబాద్ అని అంటూనే ఉండాలి?
అటు మొన్న రంగా? మొన్న చిరంజీవి? నిన్న ముద్రగడ? నేడు పవన్ కళ్యాణ్? వర్గ నాయకుల వ్యక్తిగత స్వార్ధ రాజకీయాల కోసం ఇంకా ఎంతమంది జీవితాలను ఈ కుల నాయకులు బలి చేస్తారు అని కాపు కాసే యువత నేటికీ తెలిసికోలేక పోతున్నారు?
ఈ అణగారిన వర్గాల్లో చైతన్యం లేకపోవడానికి కారకులు ఎవ్వరు? తప్పు ఎవ్వరిది? ఆరోపణలు చేసే వారిదా? లేక రెచ్చగొట్టే వారిదా? లేక అవకాశ వాదంతో కాపు కాసే వారిని తమకు అనుకూలంగా కంచాలు కొట్టించే నాయకులదా? లేక మరి ఎవ్వరిది? జాతి భవితని ఆసరా చేసికొని కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఎదుగుతున్న స్వార్ధ కుల నాయకులదా? అని తెలిసికోలేక పోతున్నారు.
“తమ వర్గ ద్రోహుల” నిజ రూపాలు తెలిసి కోవాలి. తెలిసికొని నిలదీసే రోజు అణగారిన వర్గాల్లో ఎప్పుడు వస్తుంది? “ఎన్నాళ్లీ పల్లకీల మోత” ఇంకానా అంటూ సంఘటితమయ్యే రోజు ఎప్పుడు వస్తుంది? ఆలోచించండి
(అణగారిన వర్గాల నుండి మదన పడుతున్న ఒక సామాన్యుని ఆవేదననే మా Akshara Satyam ఆర్టికల్ రూపంలో అందిస్తున్నది. ఈ సామాన్యుని ఆవేదనలో అర్ధం ఉన్నదా లేదా అనే దానిపై అణగారిన వర్గాల్లో ఉన్న యువతలో చర్చ జరగాలి అనేదే ఈ వ్యాసంలోని అంతరార్ధం)