జంగారెడ్డిగూడెం సీనియర్ పాత్రికేయులు ధనిశెట్టి భాస్కర్’కి ( Journalist Dhanisetti Bhaskar) ఆత్మీయ సత్కారం జరిగింది. డి.వి.భాస్కరరావు సాక్షి దినపత్రిక రిపోర్టర్’గా పనిచేస్తున్నారు. ధనిశెట్టి భాస్కర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పత్రికా రంగంలో చేస్తున్న సేవలకుగాను సుప్రసిద్ధ సీనియర్ పాత్రికేయులు యద్దనపూడి స్మారక గౌరవంతో సత్కరించారు.
ఈ సత్కార కార్యక్రమం మంగళవారం తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ సందర్భంగా ఐ జే యు జాతీయ కార్యవర్గ సభ్యులు డి. సోమసుందర్, వాసా సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు డి.వి.ఎల్.ఎన్.స్వామి, ఏపియుడబ్ల్యు జే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు ,పలువురు జర్నలిస్టులు భాస్కర్’ను అభినందించారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు