Covid VaccineCovid Vaccine

రాబోయే మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్‌ (Covid Vaccine) డోస్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ (Central Health Ministry) తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది అనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అందుచేతనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడ చూసినా నేడు ఇదే ప్రధాన సమస్య. కరోనా కట్టడికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తుండటంతో వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో 51లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 20కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను కేంద్రం (Central Government) ఉచితంగా రాష్ట్రాలను పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మే 14వ తేదీ వరకూ 18.43కోట్ల వ్యాక్సిన్‌ డోసులు (వెస్టెజ్’తో కలిపి) కేంద్రం అందించింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి అని చెప్పింది. పలు రాష్ట్రాలు తమ వద్ద వ్యాక్సిన్‌ డోస్‌లు కొరత ఉన్నట్లు చెబుతున్నాయి. పూర్తి వివరాలను మరోసారి పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరో మూడు రోజుల్లో 50,95,640 వ్యాక్సిన్‌ డోస్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని కేంద్రం ఆరోగ్యశాఖ నేడు ఒక ప్రకటనలో తెలిపింది.

Raghu Rama Krishna Raju Remand:

Spread the love