YSR CheyuthaYSR Cheyutha

రూ.4,339.39 కోట్లు 23.14 లక్షల మందికి సాయం
సీఎం జగన్‌ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ

వైస్సార్ చేయూత (YSR Cheyutha) రెండో విడతలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల ఖాతాల్లో నేడు జమ చేయనున్నారు. 45 – 60 వయస్సు లోపు ఉన్న మహిళలు ఈ పధకానికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున నేడు ఆర్థిక సహాయం అంద చేయ బోతున్నది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) మంగళవారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో (CM Camp office) నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయ నున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్‌ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా (Rythu Barossa) కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతీ సంవత్సరం రూ. 18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా ఏపీ ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.