madhi templemadhi temple

పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం గురవాయి గూడెం (Guravaigudem) గ్రామం నందుగల శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (Maddi Anjaneya Swamy) మహా పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
గురువాయిగూడెంలోగల తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నారు. ఈ దేవస్థానానికి శనివారం సాయంత్రానికి రాష్ట్ర నలుమూలల నుండి స్వాములు చేరుకొని ఆదివారం రోజు స్వామి వారి దేవస్థానం లో జరిగే పంచామృతాభిషేకం తిలకించారు.

అనంతరం కార్యక్రమంలో కొబ్బరి కాయలను మహా పూర్ణాహుతి నందు సమర్పించారు. దేవస్థానమంతా హనుమద్ (ఆంజనేయ) నామముతో మారు మోగినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (Executive Officer) ఆకుల కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమము నందు ఆలయ ధర్మకర్తలు మానికల బ్రహ్మానంద రావు, పరపతి భాగ్యలక్ష్మి దంపతులు పాల్గొన్నారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరిత విజయ భాస్కర్ రెడ్డి వివరించారు. కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు, కృష్ణ, ఆధ్వర్యంలో జరిగినట్లు ఆకుల కొండలరావు తెలిపారు.

శ్రీవారి దర్శనంపై అసత్య కథనాలు చేసేవారిపై చర్యలు: టీటీడీ