పొలిటికల్ ఎనాలిసిస్ (Special Story)
మార్పు తేవాలంటే ముందు జనసేనుడిలో (Janasenudu) మార్పు రావాలి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజల ప్రయోజనాల కోసం పార్టిని స్థాపించారు అనేది అందరికి తెలుసున్న విషయమే. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ (Kotary), కీలకమైన విషయాలపై ఆయన పాటిస్తున్న మౌనం పలు అనుమానాలకు తావిస్తున్నది. జనసేన పార్టీని (Janasena Party) అధికారంలోకి తేవాలి అనే కసి, పోటీతత్వం, పోరాట పటిమ జనసేనుడిలో ఉన్నాయా అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే జనసేనుడు ముఖ్యంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసికోవాలి. అప్పుడే జనసేనుడిని, జనసేన పార్టీని నమ్మి ఓటు వేసేవారి సంఖ్య పెరగ గలదు.
ప్రజా పోరాటాలు విస్తృతంగా చేయాలి:
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాలి. బీజేపీతో (BJP) పొత్తు వున్నా లేకపోయినా ప్రత్యేకహోదా & విభజన హామీల సాధన కోసం శాంతియుత నిరసనలు చేపట్టాలి. 22 ఎంపీలున్న జగన్మోహనరెడ్డిని (Jagan) అడగండి అనే దాటవేత ధోరణి వలన నిజాయితీ నిబధ్ధత చిత్తశుద్ధి లోపించాయని రుజువు అవుతుంది. 25 లక్షల మంది అభిమానులతో ఈ అంశంలో అద్భుతాలు సాధించ వచ్చు. ప్రతీ కార్యకర్తని ప్రత్యేకహోదా & విభజన హామీల (Special Status) సాధన ఆకాంక్షలని తెలిపే బ్యాడ్జీలు ధరింప చేయాలి. ఇంటి వెలుపల పోస్టర్లు న్రదర్శింప చేయాలి. ఆటోమాటిగ్గా ఇరుగూ పొరుగూ ఈ తరహా ఉద్యమం లో భాగస్వాములు అవుతారు. బీజేపీతో పొత్తు తెలివితక్కువ వ్యూహం. యూపీ ఎన్నికల లోపు మోడీని దెంపేయాలనే వాదన బీజేపీలోనే మొదలైంది. ఈ పరిస్థితులలో 0.8% ఓటు కూడా లేని పార్టీతో పొత్తు ఏ ప్రయోజనాలని ఆశించి పెట్టుకున్పారో తెలియదు. బీజేపీతో (BJP) పొత్తు అనేది తెలివితక్కువ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
క్యాడర్ నిర్మాణం-పార్టీ పటిష్టత: (Party Cadre)
క్యాడర్ నిర్భాణం అన్నది ప్రతీ పార్టీ యొక్క మౌలిక లక్షణం. ప్రజలకు పార్టీకి అనుసంధాన కర్తలుగా వ్యవహరించేది క్యాడర్. పవన్ కళ్యాణ్ భావజాలానికి ప్రజలు కనెక్ట్ అవ్వాలంటే క్యాడర్ నిర్మాణం అత్యంత కీలకం. అది ఏడు సంవత్సరాలు దాటినా ఆ నిర్మాణం జరగలేదంటే పార్టీ బలోపేతం ఇష్టమేలేదు అని భావించాల్సి వుంటుంది. పరోక్షంగా పార్టీ విజయాన్ని కోరుకొనే ఏ అధినాయకుడు కూడా పార్టీ నిర్మాణాన్ని అశ్రద్ధ చేయడు.
కోటరీ ప్రక్షాళన: (Kotary prakshalana)
పవన్ కళ్యాణ్ ఏర్పరుచుకున్న టీం మొత్తాన్ని (Pawan Team) బర్తరఫ్ చేయాలి. నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మొదలు ఆఫీస్ బాయ్ వరకూ ఏర్పడిన కార్యవర్గం 2019 సాధారణ ఎన్నికలు మొదలు తిరుపతి ఉప ఎన్నిక (Tirupathi) వరకూ ఘోరాతిఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రాజకీయ కార్యదర్శి, ఉపాధ్యక్షులు, తెలంగా ఇన్చార్జి తదితరుల ద్వారా పార్టీ పునాదులే తప్పుగా పడ్డాయి. క్యాడర్ వీరిని అసహ్యించుకుంటారు ఏవగించుకుంటారన్న విషయం బహూశా పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో. రాజకీయాలపై అవగానే లేని ఇటువంటి వ్యక్తులని పక్కన పెట్టుకుని జగన్మోహనరెడ్డి అవినీతిపై మాట్లాడటమంటే విడ్డురంగా ఉన్నది.
అనుక్షణం ప్రజలతో మమేకం:
అనుక్షణం ప్రజలతో మమేకమవటం రాజకీయ నాయకుల మౌలిక లక్షణం. ప్రజలతో కలవ కుండా కార్యకర్తలని కలవ కుండా కొందరు తొత్తులని నియమించుకుని వారితో పార్టీపి నడుపుతామంటే అంతకంటే తెలివితక్కువ తనం మరొకటి వుండదు. రాజకీయ పరిజ్ఞానం లేని వారు చెప్పే మాటలు విని, వారు ఇచ్చే నివేదికలు నమ్మి పార్టీని నడుపుతామంటే పార్టీ విజయం దిశగా ప్రయాణించదు అని జనసేనుడు ఇప్పటికైనా గ్రహించాలి.
అపోహల్ని తొలగించాలి:
పవన్ కళ్యాణ్ చాలా విషయాలు చెబుతూ వుంటారు. ఐతే మాటలకీ చేతలకీ పొంతన వుండదు అనే అనుమానాలు జనాల్లో ఉన్నాయి. ఏదైనా నాకు దేవుడి కంటే దేశం ఎక్కువని అంటారు మనసా వాచా కర్మణా అమలు చేసినపుడే ఓటర్లు నమ్ముతారు. ఆయన ప్రజల ప్రయోజనాల కోసం భావి తరాల భవిష్యత్తు కోసం పార్టీ చిత్తశుధ్ధితో నిబధ్ధతతో పని చేస్తున్నారు అని నమ్మాలంటే ఇవి ఆచరించినపుడే ఓటరు నమ్మే అవకాశం వుంటుంది.
వ్యక్తి కంటే రాష్ట్రము-దేశం గొప్ప అనే భావన పెంచాలి:
జన్మదినాలు కంటే స్వతంత్ర దినోత్సవం గొప్పది అనే దేశభక్తి సందేశాలను తన అభిమానుల్లోకి, జనాల్లోకి పంపడం పెంచాలి. అప్పుడు ప్రజల్లో పొలిటివ్ స్పందన మరింత పెరగగలదు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఊరూ వాడా జరుపుకునే అభిమానులకి ఎప్పటికప్పుడు సందేశం ఇస్తూ ఉండాలి. వ్యక్తి వ్యామోహం మన దేశాన్ని సర్వనాశనం చేసింది. మార్పు అనేది మొదలు పెట్టాలంటే వ్యక్తిపూజని అంతం ఛేయాలి. వ్యక్తి కంటే దేశం గొప్ప అనే భావన ఉండాలి. అప్పుడే దేశ సంపద దోచినా, చట్టాలని ఉల్లంఘించినా ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని ఏ వ్యక్తి ఐనా నిలదీసే తత్వం అలవడుతుంది. దేశం కంటే వ్యక్తి గొప్ప వాడైనపుడు అతను చేసే దోపిడీ దగుల్బాజీ దౌర్జన్యాలను నిలదీసి అడగ గలరు . కావుప వ్యక్తి కంటే దేశం గొప్పది అనే సిద్ధాంతాన్ని జనసేనుడు మరింత ప్రచారం చేయాలి. తన అభిమానులతో ఆచరణలో మొదలు పెట్టగలగాలి. లేకపోతే మార్పుకు అవసరమైన చైతన్యం సమాజంలో రావడం కష్టం.
ఏడాదికి ఐదు వందల సభ్యత్వం కట్టి మరీ పార్టీలో చేరుతున్నారంటే పవన్ కళ్యాణ్’ని ముఖ్యమంత్రిగా చూడటానికే అని గ్రహించాలి. అంతే గాని జగన్మోహనరెడ్డిని దింపడానికో లేక చంద్రబాబునో లోకేష్’నో ముఖ్యమంత్రిని చేయడం కార్యకర్తల లక్ష్యం కాదు. పేద మధ్యతరగతి వారు తమ చెమటను, రక్తాన్ని ధారపోసి పార్టీ కోసం తిరుగుతున్నారు అంటే అర్ధం చేసికోవాలి. దీనికి శ్రీ పవన్ కళ్యాణ్ జవాబుదారీగా ఉంటున్నారు అని కార్యకర్తలు నమ్ముతున్నారు. ఈ నమ్మకంప్రజల్లో కూడా వచ్చిన రోజునే పార్టీ అధికారం దిశగా పయనించి గలదు.
మొట్టమొదటిగా ఈ సూత్రాలని శ్రీ పవన్ కళ్యాణ్ ఆచరణలో చూపినప్పుడు మాత్రమే మార్పు కోసం ప్రజలు జనసేనుడు వెంట నడవగలరు. పూర్వపు, ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జనసేన పార్టీకి అనుకూలంగా మారాలంటే ముందు జనసేనుడు మారాలి. పార్టీలో సమూలమైన మార్పులు తేవాలి. అప్పుడు మాత్రమే జనసేన ద్వారా మార్పు రావడానికి అవకాశం ఉంది.
జనసేనుడు మారకుండా, రాజకీయ అవగాహన అలవర్చుకోకుండా, నిరంతర పోరాట పటిమణను చూపకుండా ఉండడం పార్టీకి, పార్టీ క్యాడర్’కి మంచిది కాదు. ఇలా ఉంటే జనసేన పార్టీని, జనసేనుడుని ప్రజలు కూడా సీరియస్’గా ఎప్పటికీ కూడా తీసికోలేరు. జనసేనతో రాజ్యాథికారంలో మార్పు రావడం కష్టం అని ప్రజలు భావించిన రోజున మరల తెలుగు దేశం బలపడే అవకాశమే ఉన్నది. జనసేన పార్టీ భవిశ్యత్తుపై తెలుగుదేశం పార్టీ మరొక్కసారి బలపడితే, అప్పుడు జనసేనుడిని చరిత్ర క్షమించదేమో ఆలోచించండి.
చింతా రాజశేఖర రావు (పొలిటికల్ అనలిస్టు)
(Chinta Rajashekara Rao (Political Analyst)
మీ అనాలసిస్ కొంత వరకూ నిజమే..
ఇంకా కొంత సమయం కావాలి.
ఓ టీడీపీ , ఓ ప్రజారాజ్యం పార్టీలు పెట్టినప్పటి పరిస్థి తీ ఈ రోజు పరిస్థితి కీ చాలా తేడాలు వున్నాయి.
ఇంకొంత సమయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంకా సమర్థ వంతం గా పనిచేసే రోజు వస్తుందని నమ్ముతున్నాను.
Good analysis he hope that PK will take a call.
పవన్ కళ్యాణ్ తలుపులు బిడాయించుకుని ఒంటరిగా కూర్చున్నంత వరకూ జనసేన అధోగతి తప్పదు. ప్రజలతో మమేకమవటం రాజకీయ నాయకుడికి వుండవలసిన మొదటి లక్షణం. అది లేకపోతే రాజకీయాలు అనవసరం.
ఎన్నికలు ఏడాది వున్నాయనగా వస్తే ఎవడూ నమ్మడు. నిరంతరం (సినిమాలు చేస్తూ కూడా) ప్రజల సమస్యల పై స్పందన చెపుతూ వుండవచ్చు.
First, we have to change our mindset.