శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ లిమిటెడ్ సౌజన్యంతో…
రోటరీ జంగారెడ్డిగూడెం (Jangareddygudem) అధ్యక్షులు దాకారపు కృష్ణ సారథ్యంలో రోటరీ (Rotary) నిర్వహణలో బాల గణేష్ జనరల్ మర్చంట్చ్ ప్రాంగణం వద్ద వస్త్ర సంచుల (Cotton Bags) కార్యక్రమం జరిగింది. శ్రీమద్ది ఆంజనేయ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆప రేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్లాస్టిక్ రహిత ప్రత్యామ్నాయ మార్గాలలో భాగంగా “వస్త్ర సంచుల” వాడకం పై ఆచరణతో కూడిన అవగాహనను అందించారు. అందుకు గాను వీరు వస్త్రసంచుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్లాస్టిక్ కాలుష్యం (Plastic Pollution) వల్ల పర్యావరణం (atmosphere) సమతౌల్యం కోల్పోయి భూతాపం పెరగడంతో ఎన్నో అనర్ధాలు జీవరాసులు ఎదుర్కుంటున్నాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్ చేతి కవర్లు కాకుండా ప్లాస్టిక్ రహిత ప్రత్యామ్నాయాలు వైపు సమాజం దృష్టి సారించడం ద్వారా కొంతైనా పర్యావరణం కాపాడుకోగలం. అందుకు రోటరీ జంగారెడ్డిగూడెం మరియు ఆ దిశగా సహకరించిన శ్రీమద్దిఆంజనేయ మాక్స్ లిమిటెడ్ అవగాహనతో పాటు ఆచరణ కలిగిస్తున్నది. ఆవిధంగా ప్రయత్నం చేస్తున్న వీరి కృషి అభినందనీయమని జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సురేష్ అన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాల సురేష్ గౌరవ అతిథిగా పాల్గొన్న శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాకారపు నరసింహమూర్తి మరియు రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ పంపిణీని ప్రారంభించారు.
రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వదిలివేయాలని పర్యావరణ పరిరక్షణ కోసం లోచన, అవగాహన, ఆచరణ అనే మూడు అంశాలపై రోటరీ అంతర్జాతీయ స్థాయిలో దృష్టి నిలిపిందని చెప్పారు. తమకు సహకరించిన శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ మరియు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ బాల సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాకారపు నరసింహమూర్తి మాట్లాడారు. తమ సంస్థ నుండి సామాజిక భాద్యతగా రోటరీతో సంయుక్తంగా ఇరవై వేలు విలువైన వెయ్యి వస్త్ర సంచులను పంపిణీ చేయాలని తద్వారా కొంతైనా వస్త్ర సంచుల వినియోగ ఆవశ్యకత తెలిపారు. ఈ తెలిపే క్రమంలో భాగస్వామ్యం వహించామని,రోటరీకి మరియు బాల సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం రోటరీ ప్రతినిధులు మద్ది ఆంజనేయ మాక్స్ ప్రతినిధులు ఈరోజు వారపు సంతకు విచ్చేసిన పౌరులకు, మహిళలకు వస్తసంచులను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథి సీఐ బాల సురేష్ కు శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ లిమిటెడ్ తరుపున జ్ఞాపికను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాకారపు నరసింహమూర్తి అందజేశారు.
కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, గణిత ఆనంద ప్రసాద్, కాళ్ళ వెంకట రామారావు, ధనకుమార్, పడాల సూర్యనారాయణ రెడ్డి, లింగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. . .
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు