చిరు (Chiru) GodFather సినిమాకు ధియేటర్ రివ్యూ ఎందుకు ఇవ్వలేదు అని పేస్ బుక్ పేజీ వీక్షకులు అడుగుతున్నారు.కాస్త ఆచార్యతో (Acharya) నేను ఇబ్బంది పడిన మాట అవాస్తవం. కాస్త పంధా మారుద్దాము అనే ఉద్దేశంతో GodFather పై రివ్యూని లిఖిత పూర్వముగా ఇస్తున్నాను.
వారము మధ్యలో సినిమా రావటము చేతను, మాలాంటి గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) తొలి ఆట చూడటము కాస్త కష్టమే. చిరు (Chiranjeevi) సినిమా చూడదకుండా ఉండడం అంటే నాలాటి చిరు భక్తులకు చాలా కష్టము. ఎందుకంటే కేవలము చిరు సినిమా తొలి ఆట చూసేందుకు , *మస్కట్ * నుంచి దుబాయ్, ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చి చూసే రోజులను నేను ఎలా మరిచిపోతాను.
ఇక గాడ్ ఫాదర్ లోకి వద్దాము. బాస్ చిరు GodFather సినిమా తీయడంపై మాకు నిజముగా భయము వేసింది. ముందే మలయాళీ సినిమా. అందునా తెలుగులో డబ్ అయ్యింది. ఎందుకు అబ్బా బాస్ ఈ మూవీ చేసారు అన్న భయము ఏ మూలనో ఉంటూ ఉండేది. కానీ దేనికి అదే అన్న నిజము GodFather సినిమా చూసాక అందరి నోట రావడము శుభపరిణామము.
బందరు లడ్డు బందరు లడ్డే. తిరుపతి లడ్డు తిరుపతి లడ్డే
గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్న అంత సమయము మైమరిచి పోయి నాతో పాటు అందరూ చూసారు. చిరు కొంత గ్యాప్ తరువాత మరియు ముందు సినిమాలు కాస్త నిరాశ కల్పించే టైంలో కసిమీద హిట్ ఇచ్చే సినిమాలా ఈ GodFather ఉంది అని చెప్పాలి. ఆరోజుల్లో హిట్లర్ (Hitler) సినిమాకు ఇదే భావన అప్పటిలో నాకు కల్గింది. హిట్లర్ కు గాడ్ ఫాదర్’కు ఎక్కడో కాస్త బావ సారూప్యము ఉంది అనిపిస్తుంది. రెండు సినిమా మాతృకలు మలయాళీ సినిమాలే. ఆరోజు హిట్లర్ నిర్మాత, ఈరోజు గాడ్ ఫాదర్ దర్శకుడు నాన్నగారు కావడము యదృచ్ఛకమే అయినా చెప్పుకోక తప్పదు.
చిరుని కొట్టే మొనగాడు ఎవరంటే?
గాడ్ ఫాదర్ సినిమా తో చిరంజీవి గారిని వెండి తెరపై ఇప్పటిలో కొట్టే మొనగాడు పుట్టలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెగా హీరోలు (Mega Heroes) కూడా దీనికి అతీతులు కారు. సరి అయిన కధ, మంచి స్క్రీన్ ప్లే ఉంటే చిరును ఆపడము ఎవరితరమూ కాదు అన్నది GodFather సినిమా ద్వారా చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలో కేవలము కంటితో, తన ఆహార్యముతో సినిమాను మొత్తము ఒంటి చేతితో చిరు నడిపించారు. నన్ను మీరు ఊరకనే మెగాస్టార్ (Megastar) అనలేదు అన్నట్టు చిరు తన విశ్వరూపాన్ని చూపించారు. ప్రతి నాయకుడు పాత్రలో యవకుడు సత్యదేవ్ (Satya Dev) చాలా చక్కగా ఒదిగిపోయాడు. అలానే నయనతార (Nayanatara) చాలా చక్కని నటన తో తనదయిన నటనతో అలరించారు. ప్రత్యేకంగా మిత్ర బంధానికి విలువ ఇస్తూ కొన్ని సన్నివేశాల్లో నటించిన సల్మాన్ ఖాన్’కు (Salmankhan) మెగా అభిమానులు (Mega Fans) తరుపున అభినందనలు తెల్పాలి. కేబినెట్’లో సీనియర్ మంత్రి పదవి చేపట్టిన మురళీ శర్మ (Murali Sarma) నటన మన సమకాలీన ఆంధ్ర నాయుకుల్లా ఫీల్ అవక మానము.
చివరగా తమాషా ఏమిటి అంటే రాజకీయాల్లో కోవర్ట్’లు ఎలా వుంటారో చక్కగా చూపెట్టిన దర్శకడు మోహన్ రాజాకు (Director Mohan Raja) బహుశా తన ప్రజారాజ్యము (Prajarajyam) అనుభవాన్ని బాస్ చిరంజీవి చెప్పి ఉంటారు. అందుకే ఆయా పాత్రలను ఆవిధంగా రూపకల్పన చేసి ఉంటారు.
మ్యూజిక్ అంటే పాటలే కాదు. బ్యాక్ గ్రౌండ్ లో చితక కొట్టిన తమన్’కు (Taman) శుభాకాంక్షలు చెప్పాలి. ఫొటోగ్రఫీ చూడముచ్చటగా తీసిన నీరవ్ షా’కు అభినందనలు తెలపాలి. వయసుకు తగ్గ స్టంట్’లు సూపర్’గా డైరెక్ట్ చేసిన రామలక్ష్మణ సోదరులు అభినందనీయులు.
ఓ దర్శకుడు అయి ఉండి Chiruపై అభిమానంతో జర్నలిస్ట్ పాత్ర పోషించిన పూరి జగన్నాధ్’కు ధన్యవాదములు.
చివిరిగా మంచి సినిమాకు ప్రతీ నోట మంచి మాటే వస్తాది అని నిరూపించిన తెలుగు ప్రేక్షుకులుకు ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను
ఇట్లు మెగా అభిమాని
Ramadasu Chandaka , B.tech..LLM , MUSCAT