వాల్తేర్ వీరయ్య వేదనే చిరు మనోవేదనా?
చిరులోని సహనం పవన్’లో ఆవేశం కలిస్తే
(మెగా అన్నయ్య మోనోవేదనలపై సూటిగా సుత్తిలేకుండా)
అక్షర సత్యంగా (Akshara Satyam) నేను మెగా కర్ణ, కలియుగ ధర్మరాజు అన్నయ్య
చిరంజీవి గారిని కలిసిన తరువాత ఆచార్య (Acharya), గాడ్ ఫాదర్ (Godfather), వాల్తేర్ వీరయ్య (Waltair Veeraiah) సినిమాలు వచ్చాయి.
గాడ్ ఫాదర్ లాంటి ఆచార్య వీరయ్య అయితే
తన చేతుల మీదుగా పెంచిన బిడ్డ సిద్దుపై ఆచార్యకు ఉన్న మమకారాన్ని, ఆవేదనను, ఆ సిద్ధూ భవితపై ఆచార్య పడుతున్న మనోవేదనను ఆచార్య సినిమా ద్వారా తెలుస్తున్నది.
తన రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువు తనను ద్వేషిస్తున్నది. తన మీద ద్వేషంతో తన తోబుట్టువు దుర్మార్గుల విష కౌగిలిలో నలిగిపోబోతున్నది. తన రక్తం పంచుకు పుట్టిన తన తోబుట్టువుని ఎలా కాపాడాలి. అమ్మా నీకు ఏమి కావాలి చెప్పు అమ్మా. నీకు నీ అన్నయ్య అండగా ఉన్నాడు అని గ్రహించు అమ్మా అని Godfather లో అన్నయ్య అంటుంటాడు. తోబుట్టువు కోసం చిరు పడిన మనోవేదన గాడ్ ఫాదర్ ద్వారా తెలుస్తున్నది.
నిజాయితీపరుడు, ఆవేశపరుడు అయిన తన తమ్ముడు వీరయ్యలు ఒకే రక్షం పంచుకుపుట్టిన సోదరులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకోవడానికి సిద్ధం కానీ ఒకరినొకరిని కలవడానికి ఇష్టపడరు. పరిస్థితుల ప్రభావం వల్ల ఒకరికొకరు మాట్లాడుకోలేరు. ఆ కలవక పోవడం వల్ల శత్రువుల చేతుల్లో తన తమ్ముడు ఎలా నలిగిపోతున్నాడు. ఆ తమ్ముడు మనస్సుని గెలిచుకోవడానికి వీరయ్య పడిన ఆవేదన వాల్తేర్ వీరయ్య ద్వారా తెలుసుతున్నది.
అసలు నిజమేంటి…
ఈ మూడు సినిమాల ద్వారా తాను పెంచిన/తోబుట్టువుల వారి భవిత కోసం అన్నయ్యగా చేయి చాచాలని చిరు చూస్తున్నారు అనేది తేలుతున్నది.
సినిమా దృక్కోణంలో చూస్తే ఇవి అన్నీ యాదృచ్చికంగా వచ్చిన సినిమాలు మాత్రమే. అంతకంటే ఏమీ లేదు.
పవన్ కోటరీ (Pawan Kotary) దృష్టిలో చిరు పవన్ ఎదుగుదలకు సహకరించని ఒక అన్నయ్య మాత్రమే అయి ఉండవచ్చు.
అలానే చిరు కోటరీ (Chiru kotary) దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే అన్నయ్య మాటకు ఎదురిల్లుతున్న ఒక సోదరుడు మాత్రమే అయి ఉండవచ్చు.
కానీ కానీ కానీ అక్షర సత్యం దృష్టిలో ఇది చిరు మదిలోని భావాలూ, మనోవేదనలు. తమ్ముడిపై ప్రేమ, తమ్ముడి భవితపై మనోవేదన.
తమ్ముడుని ప్రజలు కోరుకొంటున్న స్థానానికి చేర్చడానికి ఒక అన్నయ్యగా నేను చేయాల్సినది ఏమిటి అని నాడు చిరు అక్షర సత్యంతో అన్నమాటలు పైమూడు సినిమాల ద్వారా చెబుతున్న సందేశం ఒక్కటే. అదే తాను పెంచిన తోబుట్టువుపై చిరుకి ఉన్న మమకారం, ఆవేదన. తన తమ్ముడు భవితపై చిరు పడుతున్న మనోవేదన.
ఇదే విషయాన్నీ చిరు అనేక ఇంటర్ వ్యూల్లో అనేక విధాలుగా చెప్పి ఉండవచ్చు. అవి అన్నీ చిరు మనస్సులో ఉన్న మానసిక సంఘర్షణ మాత్రమే అనేది తమ్ముళ్లకు తెలుసు అలానే అక్షర సత్యానికి కూడా కొంతవరకు తెలుసు. ఒక పక్కన బిడ్డలాంటి తమ్ముడు మరొక పక్కన తనకు అక్కరకు రాని రాజకీయాలు. ఈ సంఘర్షణలు మధ్య చిరు తమ్ముడు కోసం మదన పడుతున్నారు.
తన తమ్ముడుని రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేర్చడానికి చిరు తన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అక్షర సత్యం. నేనీ మాటలు 18 నెలల క్రితమే నా వీడియోలలో, ఆర్టికల్స్’లలో చెప్పాను.
అన్నయ్య నీ సాయం నాకు కావాలి అని తమ్ముడు అడగలేడు. తమ్ముడు నీకు ఏమికావాలిరా చెప్పు అని అన్నయ్య చెప్పలేడు. వీరిద్దరూ మధ్య పుల్లలు పెట్టే కోటరీనే గాని సంధాన కర్తలు కూడా లేనే లేరు అనిపిస్తున్నది.
చిరులోని సహనం పవన్’లో ఆవేశం కలిస్తే?
అన్నయ్య చిరులోని విష్ణు తత్త్వం, తమ్ముడు పవన్ కళ్యాణ్ లోని శివ తత్త్వం కలిసిన రోజునే రాక్షస పాలకుల పీడ విరగడ అవుతుంది. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది.
శివ తత్వాన్ని, విష్ణు తత్వాన్ని కలపడం కోసం అక్షర సత్యం లాంటి వారు చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఉంటాం కూడా.
ఆలోచించండి… చిరులోని సహనం పవన్’లో ఆవేశం కలిస్తేనే రాజ్యాధికారం సాధ్యం అనే ఆవేదనలో (వాల్తేర్ వీరయ్య చుసిన తరువాత) రాసిందే తప్ప చిరు-పవన్ కోటరీలను కించ పరచాలని కాదు. (It’s from Akshara Satyam)