Nadendla at BhimavaramNadendla at Bhimavaram

గ్రామ రెవెన్యూ సహాయకులను వైసీపీ ప్రభుత్వం వేధించడం తగదు

క్షేత్ర స్థాయిలో రెవెన్యూ శాఖ (Revenue Department) విధుల్లోనూ, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లోను గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అటువంటి విఆర్ఏల పట్ల వైసీపీ ప్రభుత్వం (YCP Government) అనుసరిస్తున్న విధానం ఆ ఉద్యోగులను మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తోంది. గౌరవ వేతనం (Stipend) పేరుతో రూ.10,500 పొందే వీఆర్ఏల నుంచి గతంలో ఇచ్చిన డిఏలను రికవరీ (Recovery of DA) చేయడం భావ్యం కాదు. ధరలు పెరిగిపోయిన తరుణంలో గౌరవ వేతనం పెంచకపోగా నాలుగేళ్లనాటి డిఏలను వెనక్కి తీసుకోవడం ఏమిటి అని జనసేన పార్టీ PAC Chairmen నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆశ్చర్యం వ్యక్తం చేసారు?

2018 నుంచి పొందిన డీఏ మొత్తాలను వెనక్కి తీసుకోవడం చిరుద్యోగులను వేదన కలిగిస్తోంది. విధిలేని పరిస్థితుల్లోనే వీఆర్ఏలు రోడ్డు మీదకు వచ్చారు. వీఆర్ఏలకు గౌరవ వేతనం పెంచుతామని వైసీపీ అధినేత జగన్ (YCP president Jagan) నాడు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలి. గౌరవ వేతనం పెంచకపోగా 2018 నుంచి ఇచ్చిన డీఏను సైతం వెనక్కి తీసుకోవడం కచ్చితంగా వీఆర్ఎలను వేధించడమే అవుతుంది. 27వేల మంది ఉన్న విఆర్ఏలలో ఎక్కువ మందికి సాంకేతికపరమైన నైపుణ్యాలు ఉన్నాయి. తమ జాబ్ చార్ట్ తోపాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన క్లరికల్ విధులలోనూ పాలుపంచుకొంటున్నారు అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

24 గంటలూ విధుల్లో ఉండే ఉద్యోగులు వీఆర్ఏలు అని ప్రభుత్వం చెబుతోంది. కానీ వీరికి ఇస్తున్న గౌరవ వేతనం మాత్రం కుటుంబ పోషణకు చాలడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.26 వేలు గౌరవ వేతనం ఇవ్వాలనే డిమాండ్ తోపాటు నామినీ వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం (Jagan Government) సానుకూలంగా స్పందించాలి అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు.

ఇదా నవ నూతన ఆధునిక ఆంద్రప్రదేశ్: సామాన్యుని ఆవేదన