Mahajana Socialist Party Mahajana Socialist Party

విస్సంపల్లి సిద్దు మహాజన్ పిలుపు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎస్సార్ లాడ్జి నందు మంగళవారం మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బొడ్డపాటి పండు మాదిగ జంగారెడ్డిగూడెం కన్వీనర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ కో ఇంచార్జ్ విస్సంపల్లి సిద్దు మాదిగ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు.

మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం పాదయాత్ర చేయబోతున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీన బుధవారం రాజమహేంద్రవరం జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామం నుండి ఈ యాత్ర ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ మున్నంగి నాగరాజు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులతో ఈ పాదయాత్ర ప్రారంభం కానందుని అయన అన్నారు.

ఈ పాదయాత్రను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులంతా జయప్రదం చేయవలసిందిగా విస్సంపల్లి సిద్దు పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో జుజ్జవరపు వాసు చౌదరి, లాగు రవి, లాగు ప్రకాష్ , జొన్నకూటి పట్టియ్య తదితరులు పాల్గొన్నారు.

–జంగారెడ్డిగూడెం నుండి గురువు బాబురావు

కార్యకర్తల కుటుంబాలకు భరోసాపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు