Rythu barosa Yatra-RachabandaRythu barosa Yatra-Rachabanda

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేప్పట్టిన కౌలురైతు భరోసా యాత్రకు (Kaulu Rythu Bharosa yatra) ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. అన్నివర్గాల ప్రజలనుండి ఈ కౌలురైతు భరోసా యాత్రకు విశేష స్పందన వస్తున్నది. పవన్ చేపట్టిన ఈ కౌలురైతు భరోసా యాత్రపై జగన్ ప్రభుత్వంలో (Jagan Government) కూడా వణుకు మొదలు అయ్యింది. టీడీపీ (TDP) శ్రేణుల్లో కూడా నిరాశ మొదలు అయ్యింది. ఈ కౌలురైతు భరోసా యాత్రకు ప్రజలు అనుకూలంగా స్పందించడం మొదలు అయ్యింది.

సాగు నష్టాలతో అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన (Janasena) అధ్యక్షులు (President)  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. వారి కన్నీళ్లు తుడిచి బిడ్డల చదువులకు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మంగళవారం కౌలు రైతు భరోసా యాత్రకు అనంతపురం జిల్లాలో (Anantapur District) శ్రీకారం చుట్టారు.

పుట్టపర్తి విమానాశ్రయానికి (Puttaparthi Airport) చేరుకొని అక్కడి నుంచి కొత్త చెరువు గ్రామానికి పవన్ వెళ్లారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతి సాకే సుజాతకు అందజేశారు.

తన భర్త చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని శ్రీమతి సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు.

అనంతరం ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు  అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ధర్మవరంలో  రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.  రాజశేఖర్ రెడ్డి మరణానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య శ్రీమతి చంద్రకళకు అందజేశారు.

మా ఖాతాల్లో సాయం డబ్బులు వేస్తామని ఫోన్లు చేస్తున్నారు

ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు శ్రీ నిట్టూరు బాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శ్రీ బాబు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీ బాబు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ ఆయన భార్య శ్రీమతి మల్లికకు అందజేశారు. ఈ సందర్భంగా కుమార్తెలు ఇద్దరిని పలకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ వారి చదువుల గురించి ఆరా తీశారు. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ (Janasena Party) బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

బత్తలపల్లి గ్రామానికి చెందిన  కలుగురి రామకృష్ణ సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.  కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన భార్య శ్రీమతి నాగలక్ష్మికి అందజేశారు. మా తండ్రి చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా మా ఇంటికి రాలేదు. కానీ మీరు వస్తున్నారని తెలియగానే మా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని ఫోన్ చేసి మరీ చెబుతున్నార”ని చెప్పారు.

అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు శ్రీ మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య శ్రీమతి అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

జనసేనానికి అడుగడుగునా జననీరాజనం

ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. లక్ష సాయం అందించి, భరోసా కల్పించేందుకు అనంతపురం జిల్లాకు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్’కి ప్రజలు, పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమం కోసం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన  పవన్ కళ్యాణ్’కి బసంపల్లి గ్రామంలో ఆడపడుచులు ప్రధాన రహదారి మీదకు వచ్చి హారతులు పట్టి, పూల వర్షం కురిపించారు.

నిమ్మలకుంట గ్రామం మొత్తం రోడ్డు మీదకు వచ్చి తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు. ఆహ్వానం పలికేందుకు రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ  పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు.

కొత్తచెరువు, ధర్మవరంలలో వేల సంఖ్యలో ప్రజలు జయజయ ధ్వనాలు పలికారు. గొట్లూరులో కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన  పవన్ కళ్యాణ్’కి స్థానిక పార్టీ శ్రేణులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. దారి పొడుగునా యువత  పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణిని అడ్డుకుని సమస్యలు వివరించేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరు విద్యుత్ కోతల వెతల్ని  పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. గొట్లూరు నుంచి పూలకుంట వరకు మార్గం మొత్తం రహదారికి ఇరువైపులా భారులు తీరి జనసేన (Janasena) నినాదాలతో హోరెత్తించారు.

పర్యటన ఆధ్యంతం పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు కె. నాగబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు టి.సి. వరుణ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు కళ్యాణం శివశ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాస్, జయరామిరెడ్డి, రాందాస్ చౌదరి, పెండ్యాల హరి, భవాని రవికుమార్ తదితరులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.

అనంతపురం నుండి జనసేనాని రైతు భరోసా యాత్ర
వైసీపీ పదవులు కోసం – జేఎస్పీ రైతుల కోసం