VishnuVishnu

ప్రకాశించని నాగాస్త్రం

మా (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు (Manchu Vishnu) గొప్ప ఆధిక్యంతో ప్రకాష్ రాజ్’పై (Prakash Raj) గెలుపొందారు. తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ వర్గాల్లో కూడా గత కొన్ని రోజులుగా మా ఎన్నికలు చర్చకు దారితీసాయి. మొత్తానికి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలు (Elections) ముగిసాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణుఅపూర్వ విజయం సాధించారు. మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో ప్రకాశ్‌రాజ్‌పై గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు రాగా విష్ణుకు 381 ఓట్లు వచ్చాయి. గతకొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరువర్గాలు చిత్రసీమను (Film Industry) వేడెక్కించాయి. జరిగిన పోలింగ్‌లో ‘మా’ సభ్యులు స్పష్టమైన తీర్పునిచ్చారు. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది.‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 665మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసికొన్న విష్ణు

‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొన్నారు. ఈ గెలుపు మా నాన్నగారిది అని మంచు విష్ణు అన్నారు. ‘మా’ ఎన్నికలు ఇంత దూరం వచ్చి ఉండకూడదన్నారు. మేమంతా ఒకే కుటుంబం అని ప్రకటించారు. ఇకముందు అందరం కలిసి పనిచేస్తామని విష్ణు అన్నారు. ఇది తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి దక్కిన విజయమన్నారు.

రఘుబాబుపై జీవిత పరాజయం

జనరల్‌ సెక్రటరీ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత రాజశేఖర్‌ (Jeevitha Raja Shekar), మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు (Raghu Babu) పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వైఎస్‌ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి విజయం సాధించారు.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబుమోహన్‌ పోటీ పడ్డారు. హోరా హోరీ పోరులో శ్రీకాంత్‌ విజయం సాధించారు.

కోశాధికారిగా శివబాలాజీ

‘మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు.

కార్యవర్గ సభ్యులు ఎవరంటే?

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. మంచు విష్ణు ప్యానెల్‌లో మాణిక్, హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు.

AP Employees Union Warning to Jagan Government

–శాంతి ప్రసాద్ శింగలూరి (Shanti Prasad Singaluri), న్యాయవాది, జనసేన లీగల్