KurukshetramKurukshetram

మడి కట్టుకొని కూర్చొంటే వచ్చేది మార్పు కాదు

సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, సమగ్రత, కరుణ అనే ఆరు సుగుణాల కలగలిసిన వ్యక్తే ఆరడుగుల బుల్లెట్. అతడే జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సమాజంపట్ల, సమాజంలోని అణగారిన వర్గాల పట్ల నిబద్దత కలిగినవాడు జనసేనాని. అంజనీ పుత్రుడు (Anjani Putrudu) మార్పు కోసం అంటూ జనసేన అనే పార్టీని (Janasena Party) పెట్టారు. రాజకీయ ప్రక్షాళన కోసం అంటూ చెత్తని చుట్టూ పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు అనే విమర్శల నడుమ పార్టీని నెట్టుకొస్తున్నారు?

అణగారిన వర్గాలకు (Suppressed Classes) అధికారం సాధిస్తాను అంటూనే… అదే బాధిత వర్గాలకు అధికారాన్ని దూరం చేస్తున్న వారిని చుట్టూ పెట్టుకొంటూ పార్టీని నడుపు కొస్తున్నారు అనే ఆరోపణలను కూడా పవన్ ఎదుర్కొంటున్నారు. అయితే సేనాని వ్యూహాలు (Pawan Strategies) జనాలకు అర్ధం కానీ మిధ్యగానే మిగిలిపోతున్నవి.

నేను మార్పు కోసం పార్టీ పెట్టాను. దాని కోసం ఏమీ ఆశించని వ్యక్తులే పార్టీలో చేరవచ్చు అని సేనాని ఖరాకండీగా అంటున్నారు. ఆయనంటే ఆరడుగుల బుల్లెట్. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు ఇలా ఆశించడం తప్పు లేదు. కానీ ఏమీ ఆశించని వారు (Selfless leaders) నేటి సమాజంలో ఎక్కడ నుండి వస్తారు. ఎలా వస్తారు అనేదే బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతున్నది.

ఓ అంజనీపుత్రా కొన్ని నమ్మలేని నిజాలు…

మహాభారత కాలంలో (Maha Bharatam) ధర్మం మూడు పాదాల్లో నడిచేది. ఆ రోజుల్లోనే ఏమీ ఆశించకుండా ధర్మ యుద్ధమైన కురుక్షేత్ర (Kurukshetram) సంగ్రాంలో పాల్గొనడానికి వ్యక్తులు దొరికేవారు కాదు! నేటి కాలంలో అధర్మం ఆరు పదాల్లో నడుస్తున్నది… ఏమీ ఆశించని వ్యక్తులు మనకి మద్దతు నివ్వడానికి నేడు ఎక్కడ నుండి దొరుకుతారు.

ఎందుకంటే….

మార్పు కోసం స్వచ్చంధంగా మొదటిగా పాండవులకు (Pandavas) మద్దతు నిచ్చింది విరాట మహారాజు (Virat Maha Raja) మాత్రమే.

నీ అల్లుడిని ఏక ఛత్రాధిపతిని చేస్తాను అని కృష్ణుడి (Krishna) మాట ఇచ్చిన తరువాతే ఉత్తర (Uttara) తల్లి ఉత్తరను అభిమన్యునికి (Abhimanyu) ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకొన్నది.

అస్త్రం పట్టుకోవడానికే భయపడే ఉత్తరుడు మద్దతుని పాండవులు తీసికోక పోయినా… లేదా ఉత్తరుడు ప్రాణ త్యాగం చేయకపోతే మహా భారత యుద్ధం మొదటి రోజునే కౌరవుల వశం అయ్యేది?

కూతురు, అల్లుళ్ళు కోసమే దృపదుడు (Drupadhudu) పాండవులకు మద్దతు నివ్వాల్సి వచ్చింది. లేక పోతే ద్రుపదుని నిర్ణయం వేరే విధంగా ఉంది ఉండేదేమో?

నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని శ్రీ కృష్ణుడు మాట నిచ్చిన తరువాతే భీష్ముడు (Bheeshma) అస్త్ర సన్యాసం చేసారు.

నీ కుమారుడు చనిపోయాడు అని భయపెట్టిన తరువాతే ద్రోణుడు (Drona) అస్త్ర సన్యాసం చేసాడు.

ఓ కర్ణా! నీ జాతికి తీరని అన్యాయం చేసావు. తప్పుని సరి చేసికో. నువ్వు విశ్వ శ్రేష్ఠుడుగా మిగులుతావు అని కర్ణుడికి (Karna) కృష్ణుడు (మెస్మరైజ్) మాట ఇచ్చిన తరువాతే కర్ణుడు అస్త్ర సన్యాసం చేయగలిగాడు.

మార్పు (Change in Power) రావాలి అంటే అధర్మాన్ని (Adharma) ఓడించాలి. ఆ అధర్మాన్ని ఓడించాలి అంటే పాండవులకు మద్దతు కావాలి. నానా హామీలు ఇచ్చి, నానావిధాలుగా చెప్పి, భయపెట్టి, మద్దతు తీసికొని ఉండక పోతే ధర్మాన్ని గెలిపించేవారు కాదు. పాండవుల రూపంలో మార్పు సాధ్యం అయ్యేది కాదు.

మార్పు రావాలంటే ఏమి చెయ్యాలి?

మార్పుకి ప్రాణత్యాగాలు కావాలి. స్వచ్చందంగా మద్దుతు నిచ్చేవారు కావాలి. ప్రలోభం, భయం, పేరు వస్తుంది అనే ఎన్నో ఆశలు చూపాలి. అవి అన్నీ శ్రీ కృష్ణుడు చేసాడు కాబట్టే పాండవులు విజయం సాధించేరు అనేది భారతం ద్వారా అర్ధం చేసికోవచ్చు.

ధర్మం మూడు పాదాల్లో నడిచే రోజుల్లోనే అలా ఉంటే “అధర్మం ఆరు పదాల్లో నడిచే” ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా మార్పుకి మద్దతునిచ్చే వారు మనకు ఎక్కడ దొరుకుతారు. మార్పు కోసం ముందు మనం కూడా కొంత మారాలి.

ఆలోచించండి… మడి కట్టుకొని కూర్చొంటే వచ్చేది నరాల బలహీనతే తప్ప మార్పు కాదేమో? మార్పు కేవలం యుద్ధం వల్లనే వస్తుంది. నేడు అయితే ఎన్నికల యుద్ధంలో గెలవడం (Winning in Elections) వల్లనే మీరు ఆశిస్తున్న మార్పు సాధ్యమవుతుంది.

గమనిక: ఇది కేవలం నా వ్యక్తిగత అవగాహన, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

—It’s from Akshara Satyam

విజయ దశమికి కెసిఆర్ కొత్త జాతీయ పార్టీ (BRS)!

Spread the love