తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి
ప్రాధాన్యతలేని విద్య, వైద్యం, ఆరోగ్యం
వ్యవసాయ రంగానికి అంతంత మాత్రమే
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ (Central Budget 2023)ను నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ప్రెవేశపెట్టిన కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేటాయింపులు రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అని చెప్పాలి. యావత్తు తెలుగు ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు అని చెప్పాలి.
కేంద్ర బడ్జెట్’లోని ముఖ్యమైన అంశాలు ఏమనగా…
ఏడు అంశాలకు సప్త రుషుల రీతిలో బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం – రైతులు ప్రధాన భూమికగా ఏడు అంశాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్ కాలేజ్‌లకు అనుమతి. 13 రకాలకుపైగా గుర్తింపు కార్డులకు బదులు పాన్ (PAN) ఒక్కటి చాలు.
రైల్వేల అభివృద్ధికి రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేశారు.
పీఎం ఆవాస్ యోజన పథకానికి నిధులు పెంపు. గతేడాది రూ.48 వేల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.79వేల కోట్లకు పెంపుదల చేసారు.
కర్ణాటక అప్పర్ భద్ర పథకానికి రూ.5,300 కోట్లు కేటాయింపు జరిగింది.
మహిళల కోసం సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. రెండేళ్ల కాలానికి తీసుకొస్తున్న ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు చేసారు. రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితి రూ.30లక్షలకు పెంపు.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఉన్నవారికి ఆదాయపు పన్ను రిబేట్ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంపుదల చేసారు.
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. దీంతో వాటి ధరలు పెరుగుతాయి. టైర్లు, సిగరెట్ల ధరలూ పెరిగే అవకాశం ఉంది.
భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహన ధరలు . టీవీలు, మొబైల్, కిచెన్ చిమ్నీ, కెమెరాలు, లెన్స్, దిగుమతి చేసుకునే బంగారం ధరలు తగ్గుదల ఉంది.
ఎంఎస్‌ఎంఈలకు ముందస్తు పన్ను రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంపు.
మొత్తంగా కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా చేసారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.
5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు కేటాయింపు.
చిరుధాన్యాల కేంద్రంగా భారత్ కాబోతున్నది. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని పెంచడం కోసం కార్యాచరణ.
వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు.
బడ్జెట్-2023 ప్రకారం ఏయే వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయి
కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు
టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం
వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం
లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపు.
రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి
ధరలు తగ్గేవి ఏమనగా
మొబైల్, ల్యాప్‌టాప్, డీఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సులు
టీవీ ప్యానెల్ పార్టులు
లిథియం అయాన్ బ్యాటరీలు
ఎలక్ట్రిక్ వాహనాలు
దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం
డైమండ్‌ల తయారీ వస్తువులు
ధరలు పెరిగేవి ఏమనగా
బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులు
వెండి ఉత్పత్తులు
సిగరెట్లు, టైర్లు
దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
రాగి తుక్కు
రబ్బర్