కొద్దీ రోజుల్లో పీఆర్సీపై ప్రకటన
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో జగన్
ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నాం, ఎంత మంచి చేయగలిగితే.. అంత మంచి చేస్తాం అని ముఖ్యమంత్రి (Chief Minister) వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan)తో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని (Tadepalli) సీఎం క్యాంపు కార్యాలయంలో (CM Camp Office) జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు (CM advisor) సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy), సీఎస్ (CS) సమీర్ శర్మ (Sameer sarma), ఆర్థిక శాఖ (Finance Department) అధికారులు, ఉద్యోగ సంఘాల (Employees Unions) తరఫున వెంకట్రామిరెడ్డి (Venkata Rami Reddy), సూర్యనారాయణ (Suryanarayana), బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu), బండి శ్రీనివాసరావు, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సీఎం (CM) తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) మాట్లాడుతూ.. ‘ఉద్యోగ సంఘాలు (Employees unions) చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నా. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తున్నాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం (State Government) మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా. ఎంత మంచి చేయగలిగితే.. అంత మంచి చేస్తా. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నాం. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై (PRC) ప్రకటన చేస్తాం’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి
మనం కొన్ని వాస్తవాలను, కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం తర్వాత సంవత్సరాలన్నింటిపైనా ఉంటుంది. మనం అధికారంలోకి వచ్చాక అనుకోని పరిస్థితులు వచ్చాయి.
పీఆర్సీ గురించి ఒకవైపు మాట్లాడుతున్నాం. ఒమిక్రాన్ (Omicron) మరో వైపు విస్తరిస్తోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియదు? దాని ప్రభావం దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు? అలాంటి పరిస్థితుల మధ్య పీఆర్సీపై మాట్లాడుతున్నాం అనేది గమనించాలి.
కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు దేశ వ్యాప్తంగా 98 వేల కేసులు నమోదయ్యాయి. రేపటికి 2 లక్షలు అంటున్నారు. అనేక రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా వచ్చేసింది. ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి అంటూ ప్రభుత్వం (Government) ఉద్యోగులకు వివరించింది.
మరొపక్కన ఆదాయం తగ్గుతోంది
నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో ఐజీఎస్టీ (IGST), ఎస్‌జీఎస్టీ (SGST).. రెండు ఆదాయాలు తగ్గిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం నిర్ణయం తీసుకోవడానికి కూర్చున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసరే ఆ నిర్ణయంతో మనం కలిసి ముందుకు సాగాలి. తప్పదు. మనం చేయదగ్గ పరిస్థితి ఉందా? అన్న ఆలోచన చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన.
ఒక్కసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్ (ఎస్‌ఓఆర్స్) గమనిస్తే.. 2018–19లో ఎస్‌ఓఆర్ రూ.62,503 కోట్లు అయితే అది 2019–20లో రూ.60,934 కోట్లకు, 2020–21లో రూ.60,688 కోట్లకు తగ్గుతూ వచ్చింది అంటూ జగన్ వివరించారు.
మామూలుగా ప్రతి ఏటా 15 శాతం పెరగాలి. ఈ లెక్కన 2018–19లో ఉన్న రూ.62 వేల కోట్లు 2019–20లో రూ.72 వేల కోట్లు కావాల్సి ఉంది. 2020–21లో రూ.72 వేల కోట్లు రూ.84 వేల కోట్లు కావాల్సివుంది. మనం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం అని జగన్ అన్నారు.
జీతాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూనే ఉంది
ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం 2018–19లో రూ.52,513 కోట్లు ఉంది. కాగా అది , 2020–21 నాటికి రూ.67,340 కోట్లకు చేరుకుంది. ఉద్యోగులకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పెరుగుదల వచ్చింది అని గమనించాలి అని ప్రభుత్వం వాదన.
మనం అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చాం. దాదాపు రూ.18 వేల కోట్ల వరకు చెల్లించాం. 2019 జూలై 1 నుంచి ఈ రోజు వరకు ఐఆర్ ప్రభావం ఇది అని గమనించాలి. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు కూడా పెంచింది అని జగన్ తెలిపారు.
కాంట్రాక్టు (Contract), అవుట్ సోర్సింగ్ (Out sourcing) తదితర విభాగాలకు చెందిన 3,01,021 ఉద్యోగులకు జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.