RajyadhikaramRajyadhikaram

ప్రపంచ కార్మిక దినోత్సవ (May Day) శుభాకాంక్షలతో

ప్రభువుల పల్లకీలు మోస్తున్నది మనం. వారికి గొడ్డు చాకిరి చేస్తున్నది మనం. చాకిరేవు పెడుతున్నది మనం. వారు చస్తే పార్థివ దేహానికి కడకంటూ కాలేవరకు కాపలాగా ఉండేది మనం. కానీ మన భాధితుల కన్నీటి గాధలు ప్రభువులకి, వారి దుష్టపరివారానికి పట్టవా? అందుకే మరోప్రపంచం మరోప్రపంచం (Maro Prapancham) పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు, పోదాం పోదాం పైపైకి.

ఒకజాతిని మరొకజాతి దోపిడీ చేస్తుంటే అడగాలిసిన మీడియా (Media) దోపిడీదారులతో కలిసింది. అందుకే ఏ మీడియా చరిత్రచూసినా ఏమున్నది గర్వకారణము, మన జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వము.

బాధితుల ఆక్రందనలు వినడంకోసం, పేదవాడి ఆకలిని తీర్చడంకోసం, అణచి వేయబడ్డ వర్గాల దీనాఅవస్థలను లేకుండా చేయడంకోసం, అన్నివర్గాలను, ఒకటి రెండు వర్గాలు దోపిడీచేస్తూ ఉండడాన్ని నిరోధించడంకోసం

నేనుసైతం (Nenu saitham) ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిఇచ్చాను, నేనుసైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధార పోసాను అంటూ వచ్చే భాదిత వర్గాల నాయకుడితో కదం తొక్కుతూ పదం పాడుతూ వెంట నడుస్తూ పోదాము.

కుదిరితే జన నాయకుడి సేనుడితో (Janasenudu) పరిగెత్తు. లేకపోతే నడు. అధీ చేతకాకపోతే పాకుతూ అయినా మార్పు వెంటపో. అంతేకానీ భ్రష్టాచారులకి, దోపిడీ దారులకి పల్లకీ మోస్తూ మాత్రము ఉండకు.

పతితులారా, బ్రస్థులారా, బాధా సర్పధస్థులారా ఏడవకండి ఏడవకండి ఏడవకండి. మీభాధలు, మీగాధలు నేను ఎరుగుదను అంటూ వస్తున్నాయి వస్తున్నాయి సేనుని రధ చక్రాలు వస్తున్నాయి.

రేపటి రోజన, దోపిడీదారులు, భ్రష్టాచారులు, పాతుకుపోయిన నిరంకుశ పాలకులు, విలువలులేని ప్రచార సాధనాల అధిపతులు, గతి తప్పిన వారి అంనుంగ పరివారము, మన ఆక్రందనల రధ చక్రాల కింద నలిగిపోవడం ఖాయం.

ఇదినిజం. ఈలోకం మనదేనండి. మీరాజ్యం మీరు ఏలండి. మీస్వప్నం నిజమవుతుంది. మీస్వర్గం రుజువు అవుతుంది.

శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తానం, చలం రాసిన పీఠిక ఆధారంగా: ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో….

ఆలోచించండి!!! తరాలు మారుతున్నా తలరాతలు మారవా? ఇంకెన్నాళ్లు పల్లకీ మోత?

జగన్ రెడ్డికి పాలన చేతకాదు: నాదెండ్ల

ఆర్బీఐ నుంచి ఏపీకి మరో వెయ్యి కోట్ల ఋణం