గవర్నర్ (Governor) బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ప్రత్యేక విమానంలో (Special Flight) హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. గచ్చిబౌలి (Gachibowli) ఏఐజీలో బిశ్వభూషణ్‌కు వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో (Carona) చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.
కాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఈ నెల 17న కరోనా బారిన పడ్డారు. జలుబు (Cold), దగ్గు (cough) లక్షణాలు కనిపిచండంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ రావడంతో (Covid Positive) అయన చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి విజయవాడలోని (Vijayawada) రాజ్ భవన్‌కు (Raj Bhavan) వెళ్లిన అనంతరం మళ్లీ అస్వస్థతకు గురయ్యినట్లు తెలుస్తున్నది.