Movie Film ReelMovie Film Reel

అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లకు అనుమతి నిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సినిమా థియేటర్లు తెరుచుకుంటాయని ప్రభుత్వం చెబుతున్నది. దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర హోమ్ శాఖ కొన్ని మార్గ్రదర్శకాలను జారీ చేసింది. మరిన్ని మినహాయింపులు ఇస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ వెలుపల ఉన్న సినిమా థియేటరులు, మల్టీ ఫ్లెక్సులు ఈ నెల 15 నుండి తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ నెల 15 నుండి స్కూళ్ళు కూడా తెరుచుకోవచ్చని అయితే ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం అని చెప్పింది.

గత కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్న తెలుగు సినిమా రంగంలో కొంత కదలిక వచ్చే అవకాశం కనిపిస్తున్నది. సినిమాలు, సీరియల్స్ షూటింగులు లేక సినీ కళాకారులు, కార్మికులు, జూనియర్ అరిటిస్టులు పనులు లేక పస్తులు ఉంటున్నారు అన్న సంగతి తెలిసిందే.

సినిమా థియేటరులు ప్రారంభం కాగానే మొదటి చిత్రంగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న “కరోనా వైరస్ చిత్రాన్ని విడుదల చేస్తామని వర్మ ఇప్పటికే ప్రకటించారు. మరికొంత మంది నిర్మాతలు కూడా తమ తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసికొంటున్నట్లు సమాచారం అందుతున్నది.

ఈ నెల 15 నుండి థియేటర్లు తెరుచుకోవచ్చు అనే వార్తతో సినీ కార్మికులు అంనందపడుతున్నారు. తెలుగు సినీ రంగంతో ముడిపడి ఉన్న అందరి జీవితాల్లో ఆనందోత్సవాలు వెల్లువిరిస్తున్నాయి.

అయితే కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోవచ్చు అనే వార్తతో సినీ పరిశ్రమ ఎలాంటి జాగ్రత్తలు తీసికొంటుంది. దీనికి ప్రజలు ఎలా రిసీవ్ చేసికొంటారు అనేది వేచి చూడాలి.